Share News

అరటి కాయ కెబాబ్‌.. తయారు చేసుకోండిలా..

ABN , Publish Date - May 10 , 2026 | 12:59 PM

అరటి కాయ కెబాబ్‌.. తయారు చేసుకోవడానికి కావాల్సినవి.. అరటి కాయ - ఒకటి, ఆలుగడ్డ - ఒకటి, సింఘారా పిండి - అర కప్పు, కర్రపెండలం పిండి - అర కప్పు

అరటి కాయ కెబాబ్‌.. తయారు చేసుకోండిలా..
Banana Kebab

కావలసిన పదార్థాలు: అరటి కాయ - ఒకటి, ఆలుగడ్డ - ఒకటి, సింఘారా పిండి - అర కప్పు, కర్రపెండలం పిండి - అర కప్పు, పచ్చిమిర్చి ముక్కలు - స్పూను, కొత్తిమీర తరుగు - కొంచెం, నెయ్యి - రెండు స్పూన్లు, నూనె, ఉప్పు - తగినంత .


book8.2.jpgతయారుచేసే విధానం: అరటి కాయ తొక్క తీయాలి. ప్రెషర్‌ కుక్కర్‌లో అరటి, ఆలును ఉడికించాలి. ఆ తరవాత ఆలు పొట్టు తీసి రెండిటినీ గుజ్జులా చేయాలి. పెద్ద గిన్నెలోకి ఈ గుజ్జు, సింఘారా పిండి, కర్రపెండలం పిండి, పచ్చి మిర్చి, కొత్తిమీర, ఉప్పు అన్నిటినీ కలపాలి. అవసరమైనతే కాస్త నీళ్లనీ కలపొచ్చు. ఈ మిశ్రమాన్ని చేత్తో కెబాబ్‌లా చేసుకుని పెనంమీద నెయ్యి వేసి రెండు వైపులా కాలిస్తే అరటి కాయ కెబాబ్‌ తయారు.


ఈ వార్తలు కూడా చదవండి:

సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. అంబరాన్ని అంటిన సంబరాలు..

ఎలుకల నుంచి మనుషులకు హంటా వైరస్..

Read Latest Telangana News and National News

Updated Date - May 10 , 2026 | 12:59 PM