Share News

వంకాయ, బీట్‌రూట్‌ చిప్స్‌.. తయారు చేసుకోండిలా..

ABN , Publish Date - Jun 28 , 2026 | 12:56 PM

వంకాయ, బీట్‌రూట్‌ చిప్స్‌.. తయారీకి కావాల్సినవి.. వంకాయలు - 250 గ్రాములు, బీట్‌రూట్‌ - 250 గ్రాములు, రాతి ఉప్పు - కాస్త, కారం- అర స్పూను, ఆలివ్‌ ఆయిల్‌ - కాస్త.

వంకాయ, బీట్‌రూట్‌ చిప్స్‌.. తయారు చేసుకోండిలా..
Brinjal and beetroot chips...

కావలసిన పదార్థాలు: వంకాయలు - 250 గ్రాములు, బీట్‌రూట్‌ - 250 గ్రాములు, రాతి ఉప్పు - కాస్త, కారం- అర స్పూను, ఆలివ్‌ ఆయిల్‌ - కాస్త.

తయారుచేసే విధానం: వంకాయలు, బీట్‌రూట్‌ను బాగా కడిగి, తుడిచి సన్నని ముక్కలుగా కట్‌చేయాలి. వీటిని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అందులో ఆలివ్‌ ఆయిల్‌ వేసి కిందకీ మీదకీ కలపాలి. బేకింగ్‌ షీట్‌ వేసిన ట్రే మీద పరచాలి. కారాన్ని చల్లాలి. ఓవెన్‌లో 120 సెంటీగ్రేడ్‌ డిగ్రీల దగ్గర బేక్‌ చేయాలి. మీ ఓవెన్‌ పనితీరును బట్టి ఈ సమయం ఆధారపడి ఉంటుంది. కరకరలాడే ఈ వంకాయ, బీట్‌రూట్‌ చిప్స్‌ను ఓ డబ్బాలో వేసుకుని రెండు, మూడు రోజుల వరకు తినవచ్చు.


book9.2.jpgఈ వార్తలు కూడా చదవండి:

గడ్డి స్నానం.. మర్దనలో ఇదోరకం!

బంగాళదుంపలు ఉడికించిన నీటిని పారబోస్తున్నారా?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 28 , 2026 | 12:56 PM