బంగాళదుంపలు ఉడికించిన నీటిని పారబోస్తున్నారా?
ABN , Publish Date - Jun 28 , 2026 | 07:14 AM
వెండి వస్తువులు మురికి పట్టి ఉంటాయి. అవి తళతళ మెరవాలంటే.. సింపుల్ చిట్కాలు చాలానే ఉన్నాయి. పైసా ఖర్చు లేకుండా వాటిని సింపుల్‌గా శుభ్రం చేసుకోవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: బంగాళదుంప కూర చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని ఉడకబెట్టి కూరగా చేసుకుని తీసుకుంటే మరింత ఇష్టంగా తింటారు. వీటిని ఉడకబెట్టిన తర్వాత.. ఆ నీటిని బయట పారబోస్తుంటారు. అయితే బంగాళదుంపలను ఉడకబెట్టిన ఆ నీటి వల్ల ఉపయోగాలు ఉన్నాయని సోషల్ మీడియాలో చిట్కాలు వైరల్ అవుతున్నాయి. ఈ నీటితో వెండి వస్తువులను శుభ్రం చేయవచ్చు. అలా చేయడం వల్ల అవి తళతళ మెరుస్తాయి.
ఈ నీటిని ఎలా ఉపయోగించాలి..?
ముందుగా బంగాళదుంపలను ఉడకబెట్టిన వేడి నీటిని వడకట్టాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ వైట్ వెనిగర్ కలపాలి. ఆ తర్వాత రంగు మారిన వెండి ఆభరణాలను ఆ నీటిలో ఉంచాలి. సుమారు 15 నిమిషాల పాటు అందులో నాననివ్వాలి. అనంతరం ఆ నీటి నుంచి వెండి ఆభరణాలు బయటకు తీసి.. మెత్తటి వస్త్రంతో శుభ్రం చేయాలి. అనంతరం తేడాను మీరు గమనిస్తారు. కానీ వెండి వస్తువులపై చాలా మురికి ఉంటే మాత్రం ఫలితం కాస్తా భిన్నంగా ఉంటుంది.
ఈ జాగ్రత్తలు తప్పని సరి..
వెండి ఆభరణాలపై సున్నితమైన రాళ్లు, ముత్యాలు లేదా ప్రత్యేక పూతలు ఉంటే.. జాగ్రత్తలు తీసుకోవాలి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న నివేదిక, సమాచారం ఆధారంగా రూపొందించబడింది. దీనితో ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఎలాంటి సంబంధం లేదు. దీనికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఏ విధంగానూ బాధ్యత వహించదు.
ఈ వార్తలు కూడా చదవండి..
వర్షాకాలంలో స్వర్గంలా మారే జాతీయ పార్కులు.. జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిందే!
వర్షంలో కారు నడుపుతున్నారా? ఈ ట్రిక్ ఫాలో అవ్వండి
For More LifeStyle News And Telugu News