వంటలు: చైనీస్ నూడుల్ కట్‌లెట్స్
ABN , Publish Date - Nov 22 , 2026 | 12:44 PM
చైనీస్ నూడుల్ కట్‌లెట్స్ తయారీకి కావలసిన పదార్థాలు: హక్కా నూడుల్స్ - 150 గ్రాములు, ఉల్లి ముక్కలు - రెండు స్పూన్లు, క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలు - నాలుగు స్పూన్లు.
కావలసిన పదార్థాలు: హక్కా నూడుల్స్ - 150 గ్రాములు, ఉల్లి ముక్కలు - రెండు స్పూన్లు, క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలు - నాలుగు స్పూన్లు, ఉల్లి కాడలు - స్పూను, అల్లం, వెల్లుల్లి ముక్కలు - అర స్పూను, మిరియాల పొడి - స్పూను, ధనియాల పొడి - స్పూను, కార్న్ ఫ్లోర్ - 3 స్పూన్లు, కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు, నూనె, ఉప్పు, నీళ్లు - తగినంత.
తయారుచేసే విధానం: హక్కా నూడుల్స్‌ను ఉడికించి, వడగట్టి, కాస్త నూనె వేసి పక్కన పెట్టుకోవాలి. ఓ బాణలిలో కాస్త నూనె వేసి అల్లం, వెల్లుల్లి, ఉల్లి ముక్కల్ని వేయించాలి. ఉల్లి రంగు మారాక క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలూ, ఉల్లికాడలూ చేర్చాలి. ఉప్పు వేయాలి. కూరగాయలు కాస్త మెత్తగా అయ్యాక మిరియాల పొడి, ధనియాల పొడి కలపాలి. రెండు నిమిషాల తరవాత స్టవ్ కట్టేయాలి. చల్లగా అయ్యాక ఇందులో నూడుల్స్, కార్న్ పిండిని వేసి కలపాలి. చిన్న ముద్దలుగా చేసి, కట్‌లెట్‌గా వత్తుకుని నూనెలో అటూ ఇటూ వేయిస్తే చైనీస్ స్పైసీ నూడుల్ కట్‌లెట్స్ రెడీ. ఇవి స్నాక్స్‌గా బాగుంటాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
వంటలు: రుచిలో బహుచక్కని చుక్కకూర
వంటలు: బజ్రా మేథీ మిస్సి రోటీ.. తయారు చేసుకోండిలా..
Read Latest AP News And Telangana News And International News And Telugu News