Share News

వెరిఫికేషన్‌లో ఏర్పడే ఖాళీలను మెరిట్‌ అభ్యర్థులకే ఇవ్వాలి!

ABN , Publish Date - Nov 22 , 2026 | 08:03 AM

పోలీస్‌ కానిస్టేబుళ్ల నియామకం కోసం 2022, నవంబరులో ఇచ్చిన నోటిఫికేషన్‌లో మిగిలిన ఖాళీల భర్తీకి సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

వెరిఫికేషన్‌లో ఏర్పడే ఖాళీలను మెరిట్‌ అభ్యర్థులకే ఇవ్వాలి!

  • 2022 నాటి కానిస్టేబుళ్ల నోటిఫికేషన్‌లో క్లాజ్‌ 33(ఐగీ ) చెల్లుబాటు కాదు

  • 4 మాసాల్లో ప్రక్రియ చేపట్టాలి

  • ఎస్‌ఎల్‌పీఆర్‌బీకి హైకోర్టు ఆదేశం

అమరావతి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): పోలీస్‌ కానిస్టేబుళ్ల నియామకం కోసం 2022, నవంబరులో ఇచ్చిన నోటిఫికేషన్‌లో మిగిలిన ఖాళీల భర్తీకి సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నోటిఫికేషన్‌లో మిగిలిపోయిన 400 పోస్టులను మెరిట్‌, రిజర్వేషన్‌ నిబంధనల ప్రకారం తదుపరి మెరిట్‌ అభ్యర్థులతో భర్తీ చే యాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను నాలుగు నెలల్లోపు పూర్తి చేయాలని రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలికి(ఎస్ఎల్‌పీఆర్‌బీ) స్పష్టం చేసింది.

సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ వంటి ప్రాథమిక దశలో అభ్యర్థులు వైదొలిగినప్పుడు తదుపరి మెరిట్‌ లిస్ట్‌లో ఉన్న అభ్యర్థులకు అవకాశం ఇవ్వకపోవడం అన్యాయమని పేర్కొంది. ప్రొవిజనల్‌ జా బితాను ఎట్టి పరిస్థితుల్లోనూ సమీక్షించబోమని, వెయిం ట్‌ లిస్ట్‌ ఉండదని పేర్కొంటూ నోటిఫికేషన్‌లో క్లాజ్‌ 33(ఐగీ) చేర్చడంపై అభ్యంతరం తెలిపింది. తదుపరి మెరిట్‌ అభ్యర్థులతో ఖాళీ పోస్టులు భర్తీ చేసేందుకు అవరోధంగా ఉన్న ఈ క్లాజ్‌ చెల్లదని ప్రకటించింది.


మరోవైపు ఎంపిక ప్రక్రియలో పాల్గొన్న అభ్యర్థులు.. నోటిఫికేషన్‌లోని నిబంధనలను సవాల్‌ చేయలేరన్న పోలీస్‌ ని యామక మండలి వాదనను కూడా తోసిపుచ్చింది. ప్రక్రియలో పాల్గొన్నంత మాత్రాన ఏకపక్షంగా ఉన్న నిబంధనలను ఆమోదించినట్లు కాదని స్పష్టం చేసింది. వివిధ దశల్లో పరీక్షలు పూర్తి చేసి, తాత్కాలిక ఎంపిక జాబితా దశకు వచ్చే వరకు పిటిషనర్లకు.. ఆ క్లాజ్‌ నష్టాలు తెలియవని పేర్కొంది. కోర్టును ఆశ్రయించేందుకు ఈ దశలోనే ‘చర్యలు తీసుకోదగిన కారణం’ ఉత్పన్నం అవుతుందని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌. విజయ్‌ ఇటీవల తీర్పు ఇచ్చారు. రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి 2022లో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో పోలీసు నియామక మండలి అదే ఏడాది నవంబరు 28న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ క్రమంలో కొందరు నోటిఫికేషన్‌లోని క్లాజ్‌పై కోర్టును ఆశ్రయించారు.

ఈ వార్తలనూ చదవండి:

బెంగళూరుకు షర్మిల.. అడ్డుకునేందుకు జగన్ భారీ స్కెచ్..?

కేబీసీ సీజన్ 18 మొదటి కోటీశ్వరుడిగా యూపీఎస్సీ అభ్యర్థి

Updated Date - Nov 22 , 2026 | 08:05 AM