మొయినాబాద్‌లో విషాదం.. ఉయ్యాల ఢీకొని 10 ఏళ్ల విద్యార్థి మృతి
ABN , Publish Date - Nov 22 , 2026 | 09:23 AM
విహారయాత్రలో విషాదం చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉయ్యాల ఢీకొని ఓ విద్యార్థి మృతి చెందగా.. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం మొయినాబాద్ పరిధిలో జరిగింది.
హైదరాబాద్, నవంబర్ 22: విహారయాత్రలో విషాదం చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉయ్యాల ఢీకొని ఓ విద్యార్థి మృతి చెందగా.. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం మొయినాబాద్ పరిధిలో జరిగింది. నార్సింగిలోని ఓ పాఠశాల విద్యార్థులు విహారయాత్రలో భాగంగా మొయినాబాద్ గురుకుల్ పాఠశాల సమీపంలోని లోటస్ పాండ్ పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎక్కిన ఉయ్యాలను వేగంగా ఊపారు. దీంతో వెనుక వైపున ఉన్న ఇద్దరు విద్యార్థులను ఆ ఉయ్యాల బలంగా ఢీ కొట్టింది.
ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లాకు చెందిన విద్యార్థి టి. అభిరామ్ (10) మృతి చెందాడు. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పార్కు సిబ్బంది మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అభిరాం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అభిరామ్ మృతిపై సమాచారం అందడంతో అతడి తల్లిదండ్రులు ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్నారు. కుమారుడి మృతితో వారు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దేశంలో కోటి దాటిన హెచ్‌పీవీ టీకా డోసులు
దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సందడి.. 52 లక్షల వివాహాలతో రూ.7.5 లక్షల కోట్ల వ్యాపారం!