వంటలు: బజ్రా మేథీ మిస్సి రోటీ.. తయారు చేసుకోండిలా..
ABN , Publish Date - Nov 22 , 2026 | 12:09 PM
బజ్రా మేథీ మిస్సి రోటీ తయారీకి కావలసిన పదార్థాలు: సజ్జ పిండి - 200 గ్రాములు, గోధుమ పిండి - 100 గ్రాములు.
కావలసిన పదార్థాలు: సజ్జ పిండి - 200 గ్రాములు, గోధుమ పిండి - 100 గ్రాములు, మెంతి కూర - పావు కిలో, వెల్లుల్లి రెబ్బలు - రెండు, పెరుగు - స్పూను, పనీర్ - 50 గ్రాములు, కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు, పసుపు - అర స్పూను, కారం - అర స్పూను, ఉప్పు, నీళ్లు, నూనె - తగినంత.
తయారుచేసే విధానం: అన్ని పదార్థాలను ఓ గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి. తగినంత నీళ్లు పోసి పిండిలా కలుపుకోవాలి. ముద్దలుగా చేసి, రొట్టెలా వత్తుకుని పెనం మీద కాస్త నెయ్యి వేసి అటూ ఇటూ రెండువైపులా కాలిస్తే రుచికరమైన బజ్రా మేథీ మిస్సి రోటీసిద్ధం.
ఈ వార్తలు కూడా చదవండి:
వంటలు: రుచిలో బహుచక్కని చుక్కకూర
Read Latest AP News And Telangana News And International News And Telugu News