Share News

వంటలు: బీట్‌రూట్‌ కోఫ్తా

ABN , Publish Date - Aug 30 , 2026 | 12:08 PM

బీట్‌రూట్‌ కోఫ్తా తయారీకి కావలసిన పదార్థాలు: బీట్‌రూట్‌ - పావు కిలో, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, చీజ్‌ - రెండు స్పూన్లు, కారం - స్పూను.

వంటలు: బీట్‌రూట్‌ కోఫ్తా
Vantalu

కావలసిన పదార్థాలు: బీట్‌రూట్‌ - పావు కిలో, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, చీజ్‌ - రెండు స్పూన్లు, కారం - స్పూను, ధనియాల పొడి - స్పూను, కార్న్‌ పొడి - నాలుగు స్పూన్లు, అల్లం ముక్కలు- కొన్ని, టమాటా ముక్కలు - అర కప్పు, పచ్చి మిర్చి ముక్కలు - రెండు స్పూన్లు, కోవా - రెండు స్పూన్లు, జీడిపప్పు - ఆరు, టమాటా ప్యూరీ - అర కప్పు, జీలకర్ర పొడి-స్పూను, కసూరి మెంతి - అర స్పూను, నూనె, ఉప్పు, నీళ్లు - తగినంత.


తయారుచేసే విధానం: జీడిపప్పును వేడి నీళ్లలో అరగంట నానబెట్టాలి. సగం బీట్‌రూట్‌లు పొట్టుతీసి తురుముకోవాలి. చీజ్‌ను కూడా తురమాలి. ఓ బాణలిలో కాస్త నూనె వేసి వెల్లుల్లి ముక్కలని వేయించాలి. రెండు నిమిషాల తరవాత బీట్‌ రూట్‌ తురుము, పచ్చిమిర్చి. జీలకర్ర పొడి వేసి స్టవ్‌ కట్టేయాలి. ఉప్పు వేసి అంతా కలిపి, చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. నూనెలో ఈ ముద్దలను వేయించి పక్కన పెట్టుకోవాలి. చల్లారాక మధ్యలో కోసి రెండు అరచెక్కలుగా చేయాలి. జీడిపప్పును బ్లెండర్‌లో వేసి ముద్దగా చేసుకోవాలి. మిగతా బీట్‌రూట్‌ను చిన్న ముక్కలుగా కోసి బ్లెండర్‌లో వేసి పేస్టు చేసుకోవాలి.


book9.2.jpgఓ పాన్‌లో కాస్త నూనె వేసి ఉల్లి, అల్లం ముక్కలు వేయించాలి. పచ్చి మిర్చి, టమాటా ముక్కలు, పసుపు, జీలకర్ర పొడి వేయాలి. టమాటా ప్యూరీ, జీడిపప్పు పేస్టు కలపాలి. అంతా దగ్గరకి అవుతుంటే టమాటా ప్యూరీ, జీడిపప్పు పేస్టు వేసి అయిదు నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తరవాత బీట్‌రూట్‌ పేస్ట్‌, ఉప్పు, కోవా కలపాలి. అయిదు నిమిషాల తరవాత కసూరి మెంతి వేసి, స్టవ్‌ కట్టేయాలి. ఈ గ్రేవీనంతా ఓ గిన్నెలో వేసి మధ్యమధ్యలో బీట్‌రూట్‌ అరచెక్కలని పెడితే సరి.


ఈ వార్తలు కూడా చదవండి:

తూర్పు కనుమల్లో ‘జలమిత్రులు’

సాహసం శ్వాసగా... సాగిపో...

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 30 , 2026 | 12:08 PM