Share News

దాల్‌ కీ దుల్హన్‌.. తయారు చేసుకోండిలా..

ABN , Publish Date - Aug 30 , 2026 | 11:44 AM

దాల్‌ కీ దుల్హన్‌ తయారీకి కావలసిన పదార్థాలు: కంది పప్పు - అర కప్పు, పెసర పప్పు- రెండు స్పూను, ఎర్ర కందిపప్పు - రెండు స్పూన్లు.

దాల్‌ కీ దుల్హన్‌.. తయారు చేసుకోండిలా..
Dal Ki Dulhan recipe

కావలసిన పదార్థాలు: కంది పప్పు - అర కప్పు, పెసర పప్పు- రెండు స్పూను, ఎర్ర కందిపప్పు - రెండు స్పూన్లు, పసుపు - అర స్పూను, గోధుమ పిండి - కప్పు, నెయ్యి - రెండు స్పూన్లు, బిర్యానీ ఆకు - ఒకటి, ఎండు మిర్చి -1, దాల్చిన చెక్క- 1, లవంగాలు -2, మిరియాలు - 4, ఉల్లి ముక్కలు-అర కప్పు, ఇంగువ - కొంచెం, నీళ్లు - తగినంత.


book8.2.jpgతయారుచేసే విధానం: కాస్త నీళ్లు, ఉప్పు వేసి గోధుమ పిండిని ముద్దలా చేసి, మూత పెట్టాలి. ఓ ప్రెషర్‌ కుక్కర్‌లో కంది పప్పు, పెసర పప్పు, ఎర్ర కంది పప్పు, పసుపు, ఉప్పు, కప్పున్నర నీళ్లు వేసి మూతపెట్టాలి. మూడు విజిల్స్‌ తరవాత స్టవ్‌ కట్టేయాలి. గోధుమ పిండిని చిన్న పూరీల్లా వత్తుకుని, అటూ ఇటూ చివర్లు కలిపి పూవులా చుట్టాలి. ఆ పూవు ఫోటోలో ఉన్నట్టుగా ఉండాలి. కుక్కర్‌ మూత తీసి పప్పునంతా గరిటెతో కలిపి, కాస్త నీళ్లు పోసి ఈ పువ్వులను వేసి స్టవ్‌ వెలిగించాలి. అలా పావు గంట ఉడికించి స్టవ్‌ కట్టేయాలి. ఓ చిన్న బాణలిలో నెయ్యి వేసి ఉల్లి, ఎండు మిర్చి, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, ఇంగువ వేసి పోపు పెట్టి, పప్పు మిశ్రమంలో కలిపితే బిహారీ వంటకం దాల్‌ కీ దుల్హన్‌ తయారు.


ఈ వార్తలు కూడా చదవండి:

తూర్పు కనుమల్లో ‘జలమిత్రులు’

సాహసం శ్వాసగా... సాగిపో...

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 30 , 2026 | 11:44 AM