వంటలు: అంజీర్ కీ టిక్కీ
ABN , Publish Date - Sep 06 , 2026 | 11:16 AM
అంజీర్ కీ టిక్కీ తయారీకి కావలసిన పదార్థాలు: అంజీర్ - 50 గ్రాములు, ఉడికించిన ఆలూ - రెండు, కొత్తిమీర తరుగు - పావు కప్పు, గరమ్ మసాలా - రెండు స్పూన్లు, చాట్ మసాలా - రెండు స్పూన్లు.
కావలసిన పదార్థాలు: అంజీర్ - 50 గ్రాములు, ఉడికించిన ఆలూ - రెండు, కొత్తిమీర తరుగు - పావు కప్పు, గరమ్ మసాలా - రెండు స్పూన్లు, చాట్ మసాలా - రెండు స్పూన్లు, ధనియాల పొడి - స్పూను, వేయించిన శనగ పిండి - స్పూను, ఉప్పు, నూనె - తగినంత.
తయారుచేసే విధానం: అంజీర్‌ను గోరువెచ్చని నీళ్లలో కాసేపు నానబెట్టాలి. ఆ తరవాత ముక్కలుగా కట్ చేసి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. కొత్తిమీర, పచ్చి మిర్చి, ఉప్పునూ కలపాలి. ఇందులోనే ఆలుగడ్డ, గరం మసాలా, జీలకర్ర పొడి, చాట్ మసాలా, పచ్చి మిర్చి, కొత్తిమీర, ఉప్పు వేసి కలపి చిన్న ముద్దలుగా వత్తుకోవాలి. ఓ ప్యాన్‌లో కాస్త నూనె వేసి అంజీర్ ముద్దల్ని అటూ ఇటూ ఉడికిస్తే టిక్కీ సిద్ధం.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News