Share News

భలే బిజినెస్.. దురదపుట్టినప్పుడు గోకితే చాలు.. కనకవర్షం!

ABN , Publish Date - Sep 06 , 2026 | 10:04 AM

చైనాకు చెందిన ఓ 32 ఏళ్ల వ్యక్తి వింత వ్యాపారంతో లక్షలు ఆర్జిస్తున్నాడు. సోషల్ మీడియాలో షార్ట్ వీడియోలు చూస్తుండగా వచ్చిన ఓ ఆలోచన ప్రస్తుతం తనపై కనకవర్షం కురిపిస్తోందని చెబుతున్నాడు.

భలే బిజినెస్.. దురదపుట్టినప్పుడు గోకితే చాలు.. కనకవర్షం!
Itch Scratching Business in China

ఇంటర్నెట్ డెస్క్: చైనాకు చెందిన ఓ 32 ఏళ్ల వ్యక్తి వింత వ్యాపారంతో లక్షలు ఆర్జిస్తున్నాడు. సోషల్ మీడియాలో షార్ట్ వీడియోలు చూస్తుండగా వచ్చిన ఓ ఆలోచన ప్రస్తుతం తనపై కనకవర్షం కురిపిస్తోందని చెబుతున్నాడు. అతడు చేస్తున్న పని ఏంటి అంటే.. జనాలకు దురద వస్తున్నప్పుడు గోకడమే! ఇలా గోకితే జనాలకు చాలా నచ్చుతోందని, మసాజ్ పార్లర్లకంటే ఇదే మెరుగని జనాలు చెబుతున్నారని కూడా ఆ వ్యక్తి చెప్పుకొచ్చాడు.

ఈ వింత వ్యాపారంతో రెండు చేతులా సంపాదిస్తున్న ఆ వ్యక్తి పేరు జాంగ్ షియాకియో. ఈ ఏడాది మే నెలలోనే బొవాన్ జిల్లాలో తొలి పార్లర్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రత్యేకంగా తర్ఫీదు పొందిన కొందరు సిబ్బందిని కూడా నియమించుకున్నాడు. దురదగా ఉన్న వాళ్లు ఇక్కడికి వెళితే చాలు వారి సమస్య పరిష్కారం అయిపోతుంది. గంటకు 300 యువాన్లు (రూ.3,700) చార్జ్ చేస్తున్నాడు. తమ షాపులోని సిబ్బంది తమ గోళ్లను ప్రత్యేకంగా కట్ చేసుకుని, రంగులు వేసుకుని ఉంటారని చెప్పాడు. మనకు దురద వచ్చినప్పుడు ఎవరైనా గోకితే అద్భుతంగా ఉంటుంది కాబట్టే తన సర్వీసుకు మార్కెట్‌లో డిమాండ్ ఉందని కూడా ఆ వ్యక్తి చెప్పాడు.


చదువులు పూర్తయ్యాక అనేక ఉద్యోగాలు, వ్యాపారాలు చేసిన సక్సెస్ రాక ఇబ్బందుల్లో ఉన్న తరుణంలో ఈ ఐడియా తట్టిందని చెప్పాడు. అప్పట్లో షార్ట్ వీడియోలు చూస్తూ టైం పాస్ చేస్తుండగా ఓ వీడియో తనను అమితంగా ఆకర్షించిందని అన్నాడు. ఓ వీడియోలో కొందరు తమకు దురద పుట్టినట్టుప్పుడు ఇతరుల సాయం తీసుకుంటూ ఎంజాయ్ చేసిన వైనాన్ని చూసి ఆశ్చర్యపోయానన్నాడు. వాస్తవానికి చిన్న తనంలో తండ్రి తన వీపు మీద గోళ్లతో మెల్లగా రాస్తూ ఉంటే క్షణాల్లో నిద్రవచ్చేదని అన్నాడు. ఆ అనుభవాలు, జనాల కామెంట్స్ నుంచీ తనకు ఈ ఆలోచన వచ్చిందని చెప్పాడు. కస్టమర్ల డిమాండ్ దృష్ట్యా దేశవ్యాప్తంగా 100 వరకూ సెంటర్‌లు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు కూడా తెలిపాడు.


ఈ వార్తలనూ చదవండి:

బంగారం షాపులో యువతి చోరీ.. నగల బాక్స్‌తో పరుగో పరుగు..

8 నెలల్లో రివర్ క్లీన్.. యువకుడి పనితనానికి మెచ్చిన విదేశీ కంపెనీ..

Updated Date - Sep 06 , 2026 | 10:47 AM