8 నెలల్లో రివర్ క్లీన్.. యువకుడి పనితనానికి మెచ్చిన విదేశీ కంపెనీ..
ABN , Publish Date - Sep 05 , 2026 | 09:50 PM
ఓ వ్యక్తి ప్లాస్టిక్, చెత్తా చెదారంతో నిండిపోయిన నదిని ప్రక్షాళన చేశాడు. అయితే అతడి పనితనం చూసి.. ఓ విదేశీ కంపెనీ అతడికి జాబ్ ఆఫర్ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఓ వ్యక్తి తన పరిసరాల్లో ఉన్న నది కాలుష్య కాసారంగా మారడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ప్లాస్టిక్, చెత్తా చెదారంతో అది నిండిపోయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని తట్టుకోలేకపోయాడు. అయితే ఎవరో వచ్చి దాన్ని బాగు చేయాలా..? ఈ పనికి తాను సరిపోనా అని ప్రశ్నించుకుని నది ప్రక్షాళనకు పూనుకున్నాడు. రోజూ శ్రమిస్తూ నదిని శుభ్రం చేశాడు. అలా 8 నెలల్లో దాన్ని పూర్తిగా మార్చేశాడు. ఇదంతా సోషల్ మీడియాలో చూసిన వారు ఆ వ్యక్తిని మెచ్చుకోవడం మొదలుపెట్టారు. డచ్‌కు చెందిన అంతర్జాతీయ కంపెనీ అయితే అతడికి జాబ్ ఆఫర్ కూడా చేసింది.
మధ్యప్రదేశ్‌కు చెందిన సురేంద్ర సింగ్ చౌదరీ(బిట్టు తాబహి) ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయిన అజ్నార్ నదిని ప్రక్షాళన చేయాలని తనకు తానే సవాలు విసురుకున్నాడు. 2026 రిపబ్లిక్ డే నుంచి ఆ నదిని కొంచెం కొంచెంగా క్లీన్ చేయడం మొదలు పెట్టాడు. సాధారణ పనిముట్లతోనే శుభ్రం చేసేవాడు. ఈత కూడా రాకుపోయినా అలాగే నదిలోకి దిగి క్లీన్ చేసేవాడు.ఈ పనిలో నిమగ్నమయ్యాక అతడు ఎన్నో ఇన్ఫెక్షన్లకు గురయ్యాడు. అయినా వెనక్కు తగ్గలేదు. అలా శ్రమించి నదిని ప్రక్షాళన చేశాడు. అతడి పనితనం చూసి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రే ప్రశంసించారు. నెదర్లాండ్స్‌కు చెందిన ఓషన్ క్లీనింగ్ కంపెనీ అతడికి జాబ్ కూడా ఆఫర్ చేసింది. ఆ కంపెనీ సీఈఓ బోయన్ శ్లాట్ తమతో కలిసి పనిచేయాలని బిట్టును ఎక్స్ వేదికగా ఆహ్వానించారు.
ఇవీ చదవండి:
కెన్యాలో టాటా కెమికల్స్‌కు షట్‌డౌన్ ఆదేశం.. టాటా స్పందనిదే..
10 రోజులపాటు ఇరుకైన సొరంగంలో.. రక్షించిన ఆర్మీ సిబ్బంది