Share News

స్ట్రీట్‌ ఫుడ్‌ హబ్‌గా భద్రకాళి బండ్‌

ABN , Publish Date - Jun 11 , 2026 | 12:43 PM

వరంగల్‌ నగరంలో అందాల పర్యాటక ప్రాంతంగా విలసిల్లుతున్న భద్రకాళి బండ్‌ సరికొత్త ఆహార రుచులకు వేదికగా నిలువబోతోంది.

స్ట్రీట్‌ ఫుడ్‌ హబ్‌గా భద్రకాళి బండ్‌
Bhadrakali Bund, Warangal

  • రూ.4కోట్ల నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం

  • డీపీఆర్‌ సిద్ధం చేసిన జీడబ్ల్యూఎంసీ అధికారులు

  • రెండుసార్లు స్థల పరిశీలన చేసిన కేంద్రం

  • హబ్‌ ఏర్పాటుతో 400 మంది నిరుద్యోగులకు ఉపాది

  • వచ్చే నెలలో పనులు ప్రారంభం

వరంగల్‌: వరంగల్‌ నగరంలో అందాల పర్యాటక ప్రాంతంగా విలసిల్లుతున్న భద్రకాళి బండ్‌ సరికొత్త ఆహార రుచులకు వేదికగా నిలువబోతోంది. బండ్‌ ప్రాంతంలో ‘జీవెల్‌ ఫుడ్‌ స్ట్రీట్‌ హబ్‌’ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. వరంగల్‌ జిల్లాకు పర్యాటక ప్రాంతంగా ప్రపంచ గుర్తింపు కలిగి ఉండడం, వారసత్వ నగరం కావడంతో కేంద్ర ప్రభుత్వం గుర్తించి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌కు ఎంపిక చేసింది.


రాష్ట్రంలో హైదరాబాద్‌లోని సైబరాబాద్‌, ఖమ్మం, వేములవాడ, ధర్మపురితోపాటు వరంగల్‌ నగరం జీవెల్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ హబ్‌కు ఎంపిక కావడం ప్రత్యేకతను సంతరించుకుంది. మంగళవారం ఢిల్లీ నుంచి కేంధ్ర ప్రభుత్వ గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఉషాకిరణ్‌ గ్రేటర్‌ వరంగల్‌ నగర పాలక సంస్థ, మెప్మా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి సంతోషం వ్యక్తం చేశారు. జీవెల్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ హబ్‌కు సంబంధించిన డీపీఆర్‌లను ఇంజనీరింగ్‌ అధికారులు రూపొందించి కేంద్రానికి పంపించినట్టు తెలిపారు.


నోరూరించే రుచులు

భద్రకాళి ఆలయ పరిసరాలు, లేక్‌ వ్యూ బండ్‌ ఇప్ప టికే వరంగల్‌ నగర వాసులకు ఈవినింగ్‌ స్పాట్‌గా మారింది. సాయంత్రం ఇక్కడికి వచ్చే వేలాది మంది సందర్శకులను ఆకట్టుకునేలా ఒకే చోట్ల అన్ని రకాల ఆహార పదార్ధాలు లభించేలా స్ర్టీట్‌ ఫుబ్‌ హబ్‌ను డిజైన్‌ చేస్తున్నారు. ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ప్రమాణాలకు అనుకూలంగా పరి శుభ్రమైన వాతావరణంలో ఈ స్ట్రీట్‌ ఫుడ్‌ హబ్‌ను నిర్వహించనున్నారు. కాగా, హంటర్‌రోడ్డు మార్గంలో ఉన్న బండ్‌ ప్రధాన ద్వారం ఎదుట ఏర్పాటుచేసే హబ్‌లో తెలంగాణ సంప్రదాయ వంటకాలతో పాటు బిర్యాని, సర్వపిండి,


hnk2.jpgజొన్నరొట్టెలు, పిండి పంటకాలు, ఫాస్ట్‌ఫుడ్‌, ఐస్‌క్రీం, మాక్‌టైల్స్‌, సౌత్‌, నార్త్‌ వంటకాలు, సీజనల్‌ పండ్ల రసాల జ్యూస్‌లను ఇక్కడే తయారు చేసి స్టాల్స్‌ను నుంచి విక్రయాలు జరుపుతారు. బండ్‌ అందాలను వీక్షిస్తూ ఫుడ్‌ ఎంజాయ్‌ చేసేలా ప్రత్యేక ఓపెన్‌ ఎయిర్‌సిట్టింగ్‌ను ఏర్పాటు చేసేందుకు డీపీఆర్‌ రూపకల్పన చేశారు. అయితే వేయిస్తంభాలగుడి, వరంగల్‌ కోట, భద్రకాళి దేవాలయం, పధ్మాక్షి టెంపుల్‌, రామప్ప, లక్నవరం ప్రాంతాలకు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చేవారికి ఇక్కడి స్ర్టీట్‌ ఫుడ్‌ రుచులు, పరిసరాలు మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి.


జీవెల్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ హబ్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి నుంచి ఇప్పటికే రూ.4కోట్ల నిధులు మంజూరు చేసింది. మొత్తం ప్రాజెక్ట్‌ ఖర్చు రూ. 4కోట్లు కాగా, రూ.2.80 కోట్లు క్యాపిటల్‌ కాస్ట్‌, రూ.10 లక్షలు డిజైన్‌ ఫీజు, రూ. 80 లక్షలు ఆపరేషనల్‌ మేనేజ్‌మెంట్‌ ఖర్చులు, ప్రత్యేకలైటింగ్‌, గ్రీనరీ, పార్కిం గ్‌, టాయిలెట్స్‌, పిల్లల ఆట వస్తువులు కలుపుకుని అభివృద్ధి చేస్తారు. ఇంకా అవసరం ఉంటే జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక నిధుల నుంచి ఖర్చు చేస్తారు. కాగా, వార్షిక ఆదాయం రెంట్లు, అడ్వర్వ్టైజ్‌మెంట్‌, డిస్లే బోర్డులు, బండ్‌ మేయింటనెన్స్‌ ద్వారా యేడాదికి రూ.9.12కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


400 మంది నిరుద్యోగులకు ఉపాధి

జూలై మాసంలో పనులు ప్రారంబమయ్యే హబ్‌ పర్యాటక ప్రాంతంగానే కాకుండా స్థానికులకు ఆర్ధిక అవసరాలకు ఆసరాగా నిలువనుంది. బండ్‌పై సుమారు 50 నుంచి వంద స్టాల్స్‌ను వీధి వ్యాపారులు నిర్వహిస్తారు. కనీసం 400 మంది నిరుద్యోగులకు, డ్వాక్రా సంఘాల మహిళలకు ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. బండ్‌పై 2 కిలోమీటర్ల పొడవున స్ట్రీట్‌ ఫుడ్‌ హబ్‌ ఏర్పాటు చేసేందుకు జీడబ్ల్యూఎంసీ, డ్వాక్రా విభాగాలు సంయుక్తంగా పోటీ పడుతున్నాయి. ఇప్పటికే డీపీఆర్‌లు సిద్ధం చేసి ఢిల్లీకి పంపించగా అప్రూవల్‌ వచ్చింది. దీంతో జూన్‌ చివరి వారంలో ఈ ప్రొక్యుమెంట్‌ ద్వారా టెండర్లు పిలువనున్నారు. జూలై నుంచి ఆరు మాసాల్లో స్ట్రీట్‌ ఫుడ్‌ హబ్‌ భద్రకాళి బండ్‌పై కొత్త రంగులు, హంగులతో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని గ్రేటర్‌ ఇంజనీరింగ్‌ ఈఈ రవికుమార్‌, మెప్మా అధికారులు రమేష్‌, వెంకట్‌రెడ్డి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పోలీస్‌ జాగిలాల నక నక.. నిధుల కొరతతో అందని పౌష్టికాహారం

ముదురుతున్న ‘TRS’ టైటిల్ వార్.. రంగంలోకి మరో పార్టీ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 11 , 2026 | 12:43 PM