జిమ్ ఓనర్ దారుణ హత్య.. సెకన్లలో ప్రాణం పోయింది..
ABN , Publish Date - Jun 11 , 2026 | 11:18 AM
హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. జిమ్ ఓనర్‌ను ఓ వ్యక్తి తుపాకితో కాల్చి చంపాడు. జనం మధ్యలో.. జిమ్ ముందు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.
ఇంటర్‌నెట్ డెస్క్: హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. జిమ్ ఓనర్‌ను ఓ వ్యక్తి తుపాకితో కాల్చి చంపాడు. జనం మధ్యలో.. జిమ్ ముందు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హన్సికి చెందిన కపిల్ అనే యువకుడు పవారా చౌక్‌లో జిమ్ నడుపుతున్నాడు. గురువారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో జిమ్ దగ్గరకు వచ్చాడు. జిమ్‌కు వచ్చిన వారితో జిమ్ ముందు ఉన్న మెట్లపై వార్మ్ అప్ చేయించసాగాడు.
జిమ్‌కు వచ్చిన వారు వార్మ్ అప్ చేస్తుంటే అతడు రోడ్డు మీద నిలబడి చూడసాగాడు. కొద్దిసేపటి తర్వాత బైక్‌పై ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చారు. ఆ ఇద్దరూ ముఖానికి మాస్కులు వేసుకుని ఉన్నారు. బైక్‌పై వెనకాల కూర్చున్న వ్యక్తి కిందకు దిగాడు. కపిల్ దగ్గకు వచ్చి తుపాకితో కాల్పులు జరిపాడు. 5 సెకన్లలో 10 బుల్లెట్లు కాల్చాడు. కపిల్ రోడ్డుపై కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కపిల్ పక్కన ఉన్న ఓ మహిళకు కూడా బుల్లెట్ తగిలింది. దుండగులు కాల్పుల అనంతరం వచ్చిన బైక్‌పైనే అక్కడినుంచి వెళ్లిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థాలానికి చేరుకున్నారు. కపిల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. గాయపడ్డ మహిళను చికిత్స కోసం హిసర్ తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రత్యక్ష సాక్షుల వాగ్మూలాలను రికార్డు చేశారు. ఆ దుండగులు కపిల్‌ను ఎందుకు చంపారో తెలుసుకునే పనిలో పడ్డారు. ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయి. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
హైదరాబాద్‌లో మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసం.. ఆరుగురి అరెస్ట్
డబ్బు కంటే గౌరవమే ముఖ్యం: వైభవ్ తండ్రి సంజీవ్