Share News

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్తగా రెండు విమానాశ్రయాలు..

ABN , Publish Date - Apr 08 , 2026 | 07:21 PM

తెలంగాణ ప్రజలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో రెండు నూతన విమానాశ్రయాలు నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎయిర్‌పోర్టులు నిర్మించనున్నట్లు తెలిపారు.

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్తగా రెండు విమానాశ్రయాలు..
Union Minister Ram Mohan Naidu

వరంగల్: తెలంగాణ ప్రజలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో రెండు నూతన విమానాశ్రయాలు నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎయిర్‌పోర్టులు నిర్మించనున్నట్లు తెలిపారు. వరంగల్ విమానాశ్రయానికి మూడు నెలల్లో శంకుస్థాపన జరగనుందని కేంద్ర మంత్రి శుభవార్త చెప్పారు. అలాగే ఆదిలాబాద్‌లోనూ మరో కొత్త ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ శాఖ నిర్ణయం తీసుకుందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.


ఆదిలాబాద్‌లో రక్షణ శాఖకు చెందిన 360 ఎకరాల్లో నూతన ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ పేర్కొన్నారు. ఈ విమానాశ్రయాన్ని రక్షణ శాఖ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. రక్షణ శాఖకు సంబంధించి శిక్షణ కోసం ఈ విమానాశ్రయాన్ని వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించినట్లు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. అదే విమానాశ్రయంలో పౌర విమానయాన శాఖ టెర్మినల్ నిర్మాణం చేసుకునేందుకు రక్షణ మంత్రి అంగీకారం తెలిపారని ఆయన చెప్పారు.


రక్షణ శాఖ అవసరాలతోపాటు సాధారణ విమాన సర్వీసులు కూడా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ తెలిపారు. ఈనెల 17వ తేదీన అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం రక్షణ శాఖ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. త్వరలోనే వరంగల్‌, ఆదిలాబాద్ విమానాశ్రయాల నిర్మాణం ప్రారంభం కానుందంటూ తీపి కబురు చెప్పారు. సుమారు 430 ఎకరాలుంటే ఎయిర్ బస్ రాకపోకలకు వీలుగా విమానాశ్రయం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు.


ఇదే విషయంపై మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. వరంగల్ విమానాశ్రయానికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఆదిలాబాద్‌లో డిఫెన్స్ ఎయిర్ స్ట్రిప్ ఉందని.. ఆ స్థలంలో నూతన విమానాశ్రయం కట్టాలని చాలాకాలంగా డిమాండ్ ఉందని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి చర్చించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

చోరీకి గురైన ద్విచక్రవాహనం.. మూడు నెలల తర్వాత ఈ-చలాన్..

కారం పొడి కొనేలోపు రూ.2 లక్షలు మాయం

Updated Date - Apr 08 , 2026 | 07:42 PM