ఇద్దరు గిరిజన బాలికల ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Oct 06 , 2026 | 06:28 AM
వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని ఓ తండాకు చెందిన ఇద్దరు గిరిజన బాలికలు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వరంగల్ ఎంజీఎంలో చికిత్స..
పరిస్థితి విషమం
ఇన్‌స్టాలో పరిచయమైన యువకుల కోసం హైదరాబాద్‌కు !
ఖానాపురం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని ఓ తండాకు చెందిన ఇద్దరు గిరిజన బాలికలు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రసుత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికలకు.. ఇన్‌స్టాగ్రాంలో సూర్యాపేటకు చెందిన అజయ్, సాయి అనే ఇద్దరు యువకులతో పరిచయమైంది. వారిని కలిసేందుకు సెప్టెంబరు 28న ఇంట్లో చెప్పకుండా బస్సులో మహబూబాబాద్‌కు వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి యువకులతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లారు.
ఆ రోజు రాత్రి బస్టాండ్‌లోనే నిద్రించిన బాలికలు.. తెల్లవారాక హైదరాబాద్‌లోనే ఉంటున్న కోమటిపల్లితండాకు చెందిన నవీన్ అనే వ్యక్తి ఇంటికి చేరుకున్నారు. కుటుంబసభ్యులకు తెలియకుండా ఎందుకు వచ్చారంటూ బాలికలపై ఆగ్రహంతో చేయి చేసుకున్న నవీన్.. వెంటనే విషయం వారి తల్లిదండ్రులకు చేరవేశాడు. అప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు.. అదేరోజు సాయంత్రం వారితో కలిసి బాలికల వద్దకు చేరుకున్నారు. వారిని ఇంటికి తీసుకెళ్లే క్రమంలో.. డ్రెస్ మార్చుకుంటామని లోపలికి వెళ్లిన బాలికలు అప్పటికే తెచ్చుకున్న పురుగుల మందు తాగేశారు. ఏమీ తెలియనట్లు కారులో కూర్చున్నప్పటికీ, కొంత దూరం వచ్చాక వాంతులు చేసుకోవడంతో అసలు విషయం బయట పడింది.
ఇవి కూడా చదవండి...
‘మహాలక్ష్మి’కి మస్త్ డిమాండ్!
ఫ్యూచర్ సిటీలో విదేశీ వర్సిటీలు
ఫేస్‌బుక్‌లో అమ్మాయిల పేరుతో హనీట్రాప్
Read Latest Telangana News And Telugu News