Share News

ఫేస్‌బుక్‌లో అమ్మాయిల పేరుతో హనీట్రాప్‌

ABN , Publish Date - Oct 06 , 2026 | 06:11 AM

ఫేస్‌బుక్‌లో అమ్మాయిల పేరుతో నకిలీ ఐడీలు సృష్టించి.. వృద్ధులు, యువకులకు వలపు వల విసిరి.. దోపిడీకి పాల్పడుతున్న నిందితుడిని హైదరాబాద్‌ సిటీ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఫేస్‌బుక్‌లో అమ్మాయిల పేరుతో హనీట్రాప్‌
Facebook honey trap

  • నకిలీ ఐడీలతో వృద్ధులు, యువకులకు వల

  • 70 ఏళ్ల వృద్ధుడి నుంచి 38 లక్షలు వసూలు

  • సైబర్‌క్రైమ్‌ పోలీసులకు చిక్కిన నిందితుడు

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ఫేస్‌బుక్‌లో అమ్మాయిల పేరుతో నకిలీ ఐడీలు సృష్టించి.. వృద్ధులు, యువకులకు వలపు వల విసిరి.. దోపిడీకి పాల్పడుతున్న నిందితుడిని హైదరాబాద్‌ సిటీ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సిటీ క్రైమ్స్‌ అండ్‌ సిట్‌ అడిషనల్‌ సీపీ శ్రీనివాస్‌ ఇందుకు సంబంధించి వివరాలను సోమవారం మీడియాకు వెల్లడించారు. నగరానికి చెందిన 70 ఏళ్ల రిటైర్డ్‌ ఉద్యోగికి ఫేస్‌బుక్‌లో ఒక మహిళ పేరిట ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. దాన్ని ఆయన ఆమోదించారు. అవతలి వ్యక్తి మహిళ పేరుతో చాటింగ్‌ చేసింది. కలుపుగోలుతనం పెరిగిన తర్వాత గృహావసరాల పేరుతో కొంత డబ్బు తీసుకుంది.


కొన్ని రోజుల తర్వాత మరొక మహిళ ఫోన్‌ చేసి, తాను ఆ మహిళ బంధువునని పరిచయం చేసుకుంది. అశ్లీలమైన సంభాషణలు, ఆకర్షణీయమైన మాటలతో ఆకట్టుకుంది. కొన్ని రోజుల తర్వాత ఫేస్‌బుక్‌ చాట్‌లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డావంటూ నిరాధార ఆరోపణలు చేసింది. స్ర్కీన్‌షాట్స్‌ పంపి క్రిమినల్‌ కేసులు పెడతానని బెదిరించింది. ఆ తర్వాత మరో వ్యక్తి కాల్‌ చేసి.. పోలీసులకు అప్పగిస్తామని, పరువుతీస్తామని బెదిరించి మొత్తం రూ. 38లక్షలు వసూలు చేశారు. దీనిపై బాధితుడు 2025 జూన్‌ 17న సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసులు నిఘా పెట్టారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 26 ఏళ్ల యువకుడే ఇదంతా చేస్తున్నట్లు గురించి, అతడిని అరెస్ట్‌ చేశారు. నిందితుడు పోలీసుల అధికారుల పేరుతోనూ బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు అడిషనల్‌ సీపీ తెలిపారు.


ఇవి కూడా చదవండి...
రామప్పకు ముప్పులేదు

రామప్పను కాపాడుకునేందుకు ఉద్యమిస్తాం
హైదరాబాద్‌లో బెంగాలీల సమావేశం పెట్టండి.. వస్తా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 06 , 2026 | 06:11 AM