Share News

రామప్పకు ముప్పులేదు

ABN , Publish Date - Oct 06 , 2026 | 06:04 AM

ప్రపంచ వారసత్వ సంపద అయిన రామప్ప గుడికి మైనింగ్‌తో ముప్పు పొంచి ఉందని వస్తున్న వార్త లు కేవలం అపోహలు, అవాస్తవాలేనని సింగరేణి యాజమాన్యం స్పష్టం చేసింది.

రామప్పకు ముప్పులేదు
Ramappa Temple

  • శాస్ర్తీయ అధ్యయనం తర్వాతే మైనింగ్‌పై నిర్ణయం:సింగరేణి

హైదరాబాద్‌, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ వారసత్వ సంపద అయిన రామప్ప గుడికి మైనింగ్‌తో ముప్పు పొంచి ఉందని వస్తున్న వార్త లు కేవలం అపోహలు, అవాస్తవాలేనని సింగరేణి యాజమాన్యం స్పష్టం చేసింది. ములుగు జిల్లాలో సింగరేణి ఆధ్వర్యంలో చేపట్ట తలపెట్టిన వెంకటాపూర్‌ ఓపెన్‌కాస్ట్‌ ప్రాజెక్టు విషయంలో సమగ్రంగా శాస్ర్తీయ అధ్యయనం చేసిన తర్వాతే ముందుకు వెళ్లాలని నిర్ణయించామని సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.


ఈ విషయంలో భారత పురావస్తు శాఖ, ఇతర ప్రతిష్ఠాత్మక సంస్థలు శాస్ర్తీయంగా అధ్యయనం చేసి ఇచ్చే నివేదికల ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. బాధ్యతాయుతమైన ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న సింగరేణి..వారసత్వ సంపద పరిరక్షణకు కట్టుబడి ఉందని, పర్యావరణహితమైన, చట్టబద్ధమైన మైనింగ్‌ కార్యకలాపాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తుందని యాజమాన్యం పునరుద్ఘాటించింది.


ఇవి కూడా చదవండి...
పాదరస కాలుష్యానికి సాంకేతికతతో చెక్‌

రామప్పను కాపాడుకునేందుకు ఉద్యమిస్తాం
హైదరాబాద్‌లో బెంగాలీల సమావేశం పెట్టండి.. వస్తా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 06 , 2026 | 06:04 AM