Share News

హైదరాబాద్‌లో బెంగాలీల సమావేశం పెట్టండి.. వస్తా

ABN , Publish Date - Oct 06 , 2026 | 06:00 AM

‘తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావాలన్నది నా ఆకాంక్ష. ఇందుకోసం నా వంతు సహకారం అందిస్తా. హైదరాబాద్‌లో బెంగాలీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయండి.. నేను కూడా వస్తా..’ అని బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు సూచించారు.

హైదరాబాద్‌లో బెంగాలీల సమావేశం పెట్టండి.. వస్తా
Suvendu Adhikari, Etela Rajender

  • ఎంపీ ఈటలతో బెంగాల్‌ సీఎం సువేందు అధికారి

హైదరాబాద్‌, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ‘తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావాలన్నది నా ఆకాంక్ష. ఇందుకోసం నా వంతు సహకారం అందిస్తా. హైదరాబాద్‌లో బెంగాలీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయండి.. నేను కూడా వస్తా..’ అని బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు సూచించారు. బెంగాల్‌ పర్యటనలో ఉన్న ఎంపీ ఈటల.. సోమవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.


హైదరాబాద్‌లో బెంగాలీలు సుమారు 6 లక్షల మంది ఉన్నారని, వారిలో మల్కాజ్‌గిరి పార్లమెంటు పరిధిలోనే ఎక్కువ మంది ఉన్నారని ఈ సందర్భంగా సువేందు అన్నారు. అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సువేందుకు ఈటల శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అంతకుముందు ఆయన, కాళీమాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.


ఇవి కూడా చదవండి...
పాదరస కాలుష్యానికి సాంకేతికతతో చెక్‌

రామప్పను కాపాడుకునేందుకు ఉద్యమిస్తాం
వృత్తి నిపుణులను కాంగ్రెస్‌ వైపు మళ్లించండి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 06 , 2026 | 06:00 AM