Share News

ఫ్యూచర్‌ సిటీలో విదేశీ వర్సిటీలు

ABN , Publish Date - Oct 06 , 2026 | 06:22 AM

ఫ్యూచర్‌ సిటీలో విదేశీ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయడానికి విధి విధానాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.

ఫ్యూచర్‌ సిటీలో విదేశీ వర్సిటీలు
CS Sanjay Jaju

  • విధి విధానాలు రూపొందించండి..

  • అధికారులతో సీఎస్‌

హైదరాబాద్‌, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ఫ్యూచర్‌ సిటీలో విదేశీ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయడానికి విధి విధానాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. డిసెంబరు 7-9 తేదీల మధ్య జరిగే గ్లోబల్‌ సమ్మిట్‌కు ప్రముఖ బహుళ జాతి కంపెనీల గ్లోబల్‌ హెడ్‌లను ఆహ్వానించాలని ఆదేశాలు జారీ చేశారు. గ్లోబల్‌ సమ్మిట్‌తోపాటు రాష్ట్రంలో యంగ్‌ ఇండియా స్కూళ్లు, ఫ్యూచర్‌ సిటీలో అంతర్జాతీయ ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటు తదితర అంశాలపై సోమవారం ఆయన సమీక్షిస్తూ.. రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ కంపెనీల ప్రతినిధులకు సదస్సు సలహా మండలి/ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్నారు.


గ్లోబల్‌ సమ్మిట్‌పై ఈ నెలలోనే విదేశాల్లో, నెలాఖరులో ఢిల్లీలో రోడ్‌షోలు నిర్వహించాలన్నారు. నిర్దేశిత షెడ్యూల్‌ ప్రకారం సదస్సు ఏర్పాట్లు పూర్తి చేయాలన్న సంజయ్‌ జాజు.. తెలంగాణను అంతర్జాతీయ విద్యాకేంద్రంగా అభివృద్ధి చేయాలన్నారు. అందులో భాగంగా ఫ్యూచర్‌ సిటీలో లండన్‌ యూనివర్సిటీ వంటి ప్రముఖ విదేశీ విశ్వవిద్యాలయాలు తమ క్యాంప్‌సలు ఏర్పాటు చేసేందుకు తెలంగాణను ఆకర్షించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


ఇవి కూడా చదవండి...
‘మహాలక్ష్మి’కి మస్త్‌ డిమాండ్‌!

రామప్పను కాపాడుకునేందుకు ఉద్యమిస్తాం
ఫేస్‌బుక్‌లో అమ్మాయిల పేరుతో హనీట్రాప్‌

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 06 , 2026 | 06:22 AM