Share News

తడిసిన ధాన్యానికి కనీస మద్దతు ధర చెల్లిస్తాం: మంత్రి ఉత్తమ్

ABN , Publish Date - May 28 , 2026 | 07:56 PM

75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని వరి రైతులకు మాటిస్తున్నానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 8.5 లక్షల మంది రైతులకు రూ. 8,400 కోట్లు నగదు చెల్లించామన్నారు.

తడిసిన ధాన్యానికి కనీస మద్దతు ధర చెల్లిస్తాం: మంత్రి ఉత్తమ్

హనుమకొండ, మే 28: 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని వరి రైతులకు మాటిస్తున్నానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 8.5 లక్షల మంది రైతులకు రూ. 8,400 కోట్లు నగదు చెల్లించామన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు తరలిస్తామని వెల్లడించారు. తడిసిన ధాన్యానికి సైతం కనీస మద్దతు ధర చెల్లిస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వివరించారు. గురువారం హనుమకొండలో పౌరసరఫరాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

Ponguleti2.jpg


ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లు వేగం పెంచాలని ఈ సమీక్ష చేస్తున్నాట్లు తెలిపారు. గన్నీ బ్యాగుల కొరత లేదని చెప్పారు. జూన్ 4, 5వ తేదీల్లో రాష్ట్రంలోని రుతుపవనాలు ప్రవేశించనున్నాయని వివరించారు. ధాన్యం తరలింపునకు అన్ని మార్గాలు ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు. ఇసుక లారీలను సైతం ధాన్యం సరఫరాకు వాడుకోవాలకి తెలిపారు.

Ponguleti1.jpg


4వ తేదీ లోపు ధాన్యం, మక్కల కాంటాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. ధాన్యం తరలింపుతోపాటు నగదు చెల్లింపు వెంటనే పూర్తి చేయాలని వారికి స్పష్టం చేశారు. ధాన్యం స్టోరేజ్ కోసం ఇతర జిల్లాల గోడౌన్‌లను సైతం ఉపయోగించుకోవాలని కోరారు. తాలు, తరుగు విషయంలో నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సూచించారు.

Ponguleti.jpg


తమాషాలు చేయకుండా పనిచేయండి: పొంగులేటి వార్నింగ్

ధాన్యం కొనుగోలులో తాలు, తరుగు పేరుతో రైతులను వేధిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను పౌరసరఫరాలు, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఈ ఐదు రోజులు చాలెంజింగ్ పీరియడ్ అని అధికారులకు స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని కోరారు. తమాషాలు చేయకుండా పనిచేయాలని అధికారులకు మంత్రి వార్నింగ్ ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్ల అంశం మాత్రం సీరియస్‌గా తీసుకోవాలని అధికారులకు మంత్రి పొంగులేటి సూచించారు.

Ponguleti3.jpg


ఈ వార్తలు కూడా చదవండి..

ఒకప్పుడు పరదాల పాలన... ఇప్పుడు ప్రజల పాలన: సీఎం చంద్రబాబు

ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మరమ్మతు పనుల వాయిదా..

For More AP News And Telugu News

Updated Date - May 28 , 2026 | 08:12 PM