ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మరమ్మతు పనుల వాయిదా..
ABN , Publish Date - May 28 , 2026 | 07:13 PM
నగరంలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీకనకదుర్గమ్మ ఆలయ ఘాట్ రోడ్డు పనుల మరమ్మతును ఆర్ అండ్ బీ అధికారులు తాత్కాలికంగా వాయిదా వేశారు.
విజయవాడ, మే28: నగరంలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీకనకదుర్గమ్మ ఆలయ ఘాట్ రోడ్డు పనుల మరమ్మతును ఆర్ అండ్ బీ అధికారులు తాత్కాలికంగా వాయిదా వేశారు. శుక్రవారం నుంచి ఘాట్ రోడ్డుపైకి భక్తుల రాకపోకలకు యథావిధిగా అనుమతి ఇస్తామని తెలిపారు. భారీగా ఎండలు, వడగాల్పుల కారణంగా.. ఘాట్ రోడ్డు మరమ్మతు పనులు కొనసాగించలేమని ఆర్ ఆండ్ బీ అధికారులు వివరించారు. తొలుత ఈ ఘాట్ రోడ్డు మరమ్మతు పనులు మంగళవారం (మే 26వ తేదీ) నుంచి చేపట్టాలని దేవస్థానం ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ పనులు జూన్ 12వ తేదీ వరకు కొనసాగుతాయని వెల్లడించారు.
దీంతో ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకునే భక్తులకు పలు ఆంక్షలు విధించారు. కొండపైకి వివిధ మార్గాల్లోల రావాలంటూ భక్తులకు స్పష్టం చేశారు. అయితే విజయవాడలో ఎండలు మండిపోతున్నాయి. వేడి గాలులు వీస్తున్నాయి. దీంతో మధ్యాహ్నం వేళ.. పనులు చేయాలంటే అధికారులే కాదు.. కార్మికులు సైతం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం దేవస్థానం ఉన్నతాధికారులకు చేరింది. దీంతో ఈ ఘాట్ రోడ్డు మరమ్మతు పనులను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఒకప్పుడు పరదాల పాలన... ఇప్పుడు ప్రజల పాలన: సీఎం చంద్రబాబు
ఆ విషయాన్ని నమ్మిన నాయకుడు సీఎం చంద్రబాబు: కేంద్ర మంత్రి పెమ్మసాని
For More AP News And Telugu News