ఒకప్పుడు పరదాల పాలన... ఇప్పుడు ప్రజల పాలన: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - May 28 , 2026 | 06:25 PM
వర్చువల్‌గా మహానాడు అదరగొట్టిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తెలిపారు. వర్చువల్‌గా మహానాడు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. రెండ్రోజులపాటు వర్చువల్ మహానాడు అద్భుతంగా జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు.
అమరావతి, మే28: వర్చువల్‌గా మహానాడు అదరగొట్టిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తెలిపారు. వర్చువల్‌గా మహానాడు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. రెండ్రోజులపాటు వర్చువల్ మహానాడు అద్భుతంగా జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. గురువారం మహానాడు ముగింపు సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు... కామన్ మ్యాన్ అని స్పష్టం చేశారు. ఈ 23 నెలల్లో రూ. లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామన్నారు. ప్రతి సంవత్సరం టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నామని వివరించారు.
ఒకప్పుడు పరదాల పాలన... ఇప్పుడు ప్రజల పాలన అని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరేలా చూస్తున్నామని చెప్పారు. పోకిరీలు, ఆకతాయిల ఆటకట్టిస్తామని ప్రకటించారు. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే అదే వారికి చివరి రోజు అవుతుందని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తల పార్టీ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. నాయకులు వస్తారు.. కొందరు కుప్పిగంతులు వేస్తారు.. పార్టీని మోసేది మాత్రం కార్యకర్తలే అని ఆయన స్పష్టం చేశారు. కార్యకర్తే అధినేత అనేది మహానాడులో కనిపించిందన్నారు.
16 లక్షల 75 వేల మంది వర్చువల్‌గా ఈ మహానాడుకు హాజరయ్యారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వివరించారు. 18 దేశాల నుంచి ఆన్‌లైన్‌లోకి వచ్చారని పేర్కొన్నారు. రికార్డు సృష్టించడం, తిరగరాయడం, రికార్డులు బద్దలుకొట్టడం టీడీపీకే సాధ్యమని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తల బీమా కోసం రూ.150 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. 2047 విజన్ తయారు చేశామని.. స్వర్ణాంధ్రగా మార్చాలని ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. విద్య, వైద్యం, ఉపాధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌కు సరైన సమయంలో కేంద్రం సహకరించిందని సీఎం చంద్రబాబు వివరించారు. ఆదాయాన్ని పెంచుకోకపోతే మనం నిలబడలేమన్నారు. ప్రగతి లేకపోతే స్థిరంగా నిలబడలేమని చెప్పారు. రాష్ట్రానికి గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వచ్చాయంటే ఆనంద పడ్డానని తెలిపారు. 23 నెలల్లోనే ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు సాధనలో ముందున్నామని వివరించారు. ఆర్ధిక అసమానతలు తగ్గించడానికి పీ 4 తీసుకువచ్చామన్నారు. అలాగే పెట్టుబడిదారుల్లో కూడా నమ్మకాన్ని తీసుకువచ్చామని పేర్కొన్నారు.
సైనింగ్, ఎంవోయూ, గ్రౌండింగ్, ఓపెనింగ్ అన్ని వేగవతం చేస్తున్నామని తెలిపారు. 36 రోజుల్లో ఫైటర్ జెట్ పరిశ్రమను తీసుకువచ్చామంటే.. అదే మన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని సోదాహరణగా వివరించారు. ఉద్యోగం ఇవ్వడమే మా భాద్యత అని యువతకు స్పష్టం చేస్తున్నామన్నారు. ఇప్పడు కూడా ప్రాజెక్టులలో 65 శాతం నీరు ఉంది... అయినా ఈసారి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. 15 శాతం వర్షపాతం తక్కవ పడుతుందని.. దానికి అన్ని విధాలా సన్నద్ధం కావాల్సి ఉందని తెలిపారు. స్వయం ఏపీ బ్రాండ్ తీసుకువచ్చాము... ఇది బాగా జరిగితే ఏపి బ్రాండ్.. గ్లోబల్ బ్రాండ్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
ఈ మహానాడుని ఆడబిడ్డలకు అంకితం చేశామన్నారు. ఇది మహిళా మహానాడు అని తెలిపారు. మహిళలకు ఆస్తిహక్కు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని ఆయన గుర్తు చేశారు. ఇప్పడు రాజకీయ స్వేచ్చ ఇచ్చేది కూడా టీడీపీనే తెలిపారు. కేంద్రం వద్ద అన్ని పార్టీలు ఒప్పుకోకపోతే.. మన పార్టీలోనే రిజర్వేషన్లు అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఆడబిడ్డలకు 33 శాతం చట్ట సభల్లో సీట్లు ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. మీరు ముందుంటే మిమ్మల్ని నడిపించడానికి నేను ముందుంటా మీరు సిధ్దంగా ఉండాలని మహిళలకు సీఎం చంద్రబాబు నాయడు స్పష్టం చేశారు. ఒకప్పడు కట్నం అనేది పెద్ద భారం ఇప్పడు ఆడపిల్లలకు రివర్స్ డౌరీ ఇచ్చే పరిస్ధితి వచ్చిందన్నారు.
కేంద్రంలో మహిళా బిల్లుకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నారు. మనకు పార్టీలో 18 విభాగాలు ఉన్నాయని వివరించారు. కానీ గొడ్డలి పార్టీకి ఉన్న విభాగాలు ఎన్నో తెలుసా అంటూ ఈ సభా వేదికగా ప్రశ్నించారు. గంజాయి , బ్లేడ్ బ్యాచ్, పేటిఎం బ్యాచ్, హత్యారాజకీయాలు, హిందూ ధర్మంపై దాడికి ఇంకో విభాగం, కల్తీ లిక్కర్ మాఫియా ఇంకో విభాగం ఇలాంటి ఏడు విభాగాలు పెట్టుకున్న పార్టీ ఈ గొడ్డలి పార్టీ అని వివరించారు. మీరు గొడ్డలి పార్టీతో జాగ్రత్తగా ఉండకపోతే మీకు కూడా గొడ్డలి వేటే అని ప్రజలకు సీఎం చంద్రబాబు హెచ్చరించారు. దేవాలయాలను అప్రదిష్ట పాలు చేయాలని చూసేవారిని వదిలేది లేదని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కూలగొట్టడం, విధ్వంసం చేయడమే గొడ్డలి పార్టీ నైజం: మంత్రి నిమ్మల
ఆ విషయాన్ని నమ్మిన నాయకుడు సీఎం చంద్రబాబు: కేంద్ర మంత్రి పెమ్మసాని
For More AP News And Telugu News