Share News

రికార్డు స్థాయిలో ధాన్యం ధర

ABN , Publish Date - Jun 18 , 2026 | 11:31 AM

మహబుబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ధాన్యం ధర ఈ సీజన్‌లో అత్యధికంగా క్వింటాకు రూ.2,906 నమోదైంది.

రికార్డు స్థాయిలో ధాన్యం ధర
Paddy Prices, Kesamudram

  • ఆర్‌ఎన్‌ఆర్‌ క్వింటాకు గరిష్ఠంగా రూ.2,906

  • కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో వడ్లకు హైరేట్‌

కేసముద్రం(మహబుబాబాద్): మహబుబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ధాన్యం ధర ఈ సీజన్‌లో అత్యధికంగా క్వింటాకు రూ.2,906 నమోదైంది. గత 15 రోజులుగా ఈ మార్కెట్‌లో ఆర్‌ఎన్‌ఆర్‌ రకం వడ్లరేట్‌ రోజురోజుకూ పెరుగుతోంది. స్థానిక మార్కెట్‌కు బుధవారం ధాన్యాన్ని 11 మంది రైతులు 274 బస్తాల్లో తీసుకురాగా, ఎలక్ట్రానిక్ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌ (ఈ-నామ్‌) విధానంలోని ‘ఈ- వేలం’లో క్వింటాకు గరిష్ఠంగా రూ.2,906, కనిష్ఠంగా రూ.2, 226, సగటున రూ.2,589 ధరలతో వ్యాపారులు ఖరీదులు చేశారు. ధాన్యానికి ప్రభుత్వ కనీస మద్దతు ధర (ఎంఎ్‌సపీ) క్వింటాకు రూ.2,389 ఉండగా,


hnk2.jpgఈ సీజన్‌లో అంతకంటే ఎక్కువగానే మార్కెట్లో ధరలు ఉన్నాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉంటాయనే కారణాలతో వ్యాపారులు నిల్వ చేసేందుకు మార్కెట్లో ధాన్యం ఖరీదులు పెంచారు. ఈ క్రమంలో దేశీయంగా ధాన్యానికి డిమాండ్‌ ఏర్పడడంతో మార్కెట్లో ఈ సీజన్‌లో గత 15 రోజులుగా ధాన్యం సగటు ధర పెరుగుతూ వస్తోంది. ఈ నెల 1న ధాన్యం సగటు ధర రూ.2,475 నుంచి రూ.2,495 వరకు ఉన్నాయి. ఆ తర్వాత ఈనెల 4న సగటు ధర రూ.2, 589, 5న రూ.2636, 8న రూ.2,689, 9న రూ.2,729గా నమోదయ్యాయి. తాజా గా గరిష్ఠ ధర రూ.2,900 మార్కు దాటడం విశేషం.


ఈ వార్తలు కూడా చదవండి:

20న రెండు ఎంఎంటీఎస్‏లు రద్దు

భళా.. ముల్కనూర్‌ సీడ్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 18 , 2026 | 11:36 AM