సమాధానాలు చెప్పలేక వ్యక్తిగత విమర్శలా?: కొప్పుల ఈశ్వర్
ABN , Publish Date - Jun 18 , 2026 | 11:17 AM
ధాన్యం కొనుగోళ్లు, సంక్షేమ హాస్టళ్ల టెండర్లలో అవినీతి జరిగిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఈ విషయాలపై సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరీంనగర్: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ధాన్యం కొనుగోళ్లు, సంక్షేమ హాస్టళ్ల టెండర్లలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించిన ఆయన, ఈ విషయాలపై సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. ధర్మపురి నియోజకవర్గంలోని ఇసుక రీచ్‌లు మాయమయ్యాయన్న అంశం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు నిజంగా ధైర్యం ఉంటే మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజల ముందుకు రావాలని సవాల్ విసిరారు. మంత్రి పదవికి రాజీనామా చేయడం అంత సులభమైన విషయం కాదని, ఎన్నో కష్టాలు పడి ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన లక్ష్మణ్‌కు రాజీనామా చేసే ధైర్యమే లేదని ఎద్దేవా చేశారు.
ప్రజా సమస్యలు, అవినీతి ఆరోపణలపై సమాధానాలు చెప్పలేక వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. హరీశ్‌రావును ‘దొర’ అంటూ కులాన్ని ప్రస్తావిస్తూ రాజకీయాలు చేస్తున్నావా? అంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటల సమయం
Read Latest Telangana News