పసుపు క్వింటాకు రూ.19 వేలు
ABN , Publish Date - Oct 27 , 2026 | 01:29 PM
హబుబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో పసుపునకు రికార్డుస్థాయిలో ధర నమోదైంది.
కేసముద్రం(మహబుబాబాద్): మహబుబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో పసుపునకు రికార్డుస్థాయిలో ధర నమోదైంది. ఈ మార్కెట్‌కు కాడిరకం పసుపును ఏడుగురు రైతులు 69 బస్తాల్లో, గోళరకం ముగ్గురు రైతులు 30 బస్తాల్లో తీసుకువచ్చారు. ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈ-నామ్) విధానంలోని ‘ఈ-వేలం’లో కాడిరకం పసుపు క్వింటాకు గరిష్ఠంగా రూ.19,253, కనిష్ఠంగా రూ.15,589, సగటున రూ.19,252, గోళరకం గరిష్ఠంగా రూ.18,566,
కనిష్ఠంగా రూ.8,506, సగటున రూ.17,469 ధరలతో వ్యాపారులు ఖరీదులు చేశారు. ఈ మార్కెట్‌కు రెండురోజుల సెలవుల కంటే ముందు ఈ నెల 22న పసుపు విక్రయానికి రాగా క్వింటాకు రూ.13,319 వరకే ధర నమోదైంది. మార్కెట్‌కు వచ్చిన పసుపు నాణ్యత బాగుండడంతో క్రితం మార్కెట్‌తో పోలిస్తే ఒకేసారి క్వింటాకు రూ.6వేలు పెరిగి రూ.19 వేల ధర రావడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి:
ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో రాతి గుహ
సీతాఫలాల సీజన్ షురూ.. పాలకుర్తి మార్కెట్‌లో కిలో రూ.150
Read Latest AP News And Telangana News And International News And Telugu News