కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద కాఫర్ డ్యామ్ నిర్మించండి
ABN , Publish Date - Oct 20 , 2026 | 04:53 AM
రాష్ట్రంలో కరువు పరిస్థితులను ఎదుర్కొని రైతులకు మేలు చేయాలంటే.. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద 93 మీటర్ల ఎత్తులో కాఫర్ డ్యామ్ నిర్మించి ప్రాణహిత నీళ్లను మళ్లించాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రభుత్వానికి సూచించారు.
రైతులకు మేలు చేయకపోతే పోరాటాలు తప్పవ్ : కవిత
మహదేవపూర్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరువు పరిస్థితులను ఎదుర్కొని రైతులకు మేలు చేయాలంటే.. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద 93 మీటర్ల ఎత్తులో కాఫర్ డ్యామ్ నిర్మించి ప్రాణహిత నీళ్లను మళ్లించాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రభుత్వానికి సూచించారు. నవంబరులోగా కాఫర్ డ్యామ్ నిర్మించాలన్నారు. రైతుల తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని, వినకపోతే ప్రభుత్వం మెడలు ఎలా వంచాలో తమకు తెలుసని వ్యాఖ్యానించారు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కన్నెపల్లి పంప్‌హౌస్(లక్ష్మీ పంప్‌హౌ్‌స)ను సోమవారం ఆమె సందర్శించారు.
గోదావరి నీటి ప్రవాహాన్ని పరిశీలించిన అనంతరంపవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాఫర్ డ్యామ్ నిర్మాణం ఎక్కడ చేపట్టవచ్చో... దాని ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉంటుందో వివరించారు. కేవలం రూ. 25 కోట్లు ఖర్చు చేస్తే నెలన్నర రోజుల్లో నిర్మాణం పూర్తి చేయొచ్చన్నారు. మేడిగడ్డ బూచిని చూపి రైతులకు నష్టం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కరువు కోరల్లో చిక్కుకున్న రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు నిపుణులతో మాట్లాడి కాఫర్ డ్యామ్ నిర్మాణమే సరైన పరిష్కార మార్గమని గుర్తించామన్నారు. సంబంధిత సాంకేతిక అంశాలను ప్రభుత్వానికి వివరిస్తామన్నారు. తమ సూచనను ప్రభుత్వం పరిశీలించాలని, ఏవైనా మార్పులు ఉన్నా తాము అంగీకరిస్తామని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
మద్యం విక్రయాల జోరు.. దసరా నేపథ్యంలో ఫుల్ జోష్
డిజిటల్ వేదికపై తాండూరు కందిపప్పు రైతులు
Read Latest AP News And Telangana News And International