మద్యం విక్రయాల జోరు.. దసరా నేపథ్యంలో ఫుల్ జోష్
ABN , Publish Date - Oct 20 , 2026 | 04:41 AM
దసరా పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. గతేడాది దసరా సీజన్‌తో పోలిస్తే.. ఈసారి మద్యం అమ్మకాల ఊపు పెరిగింది.
17వ తేదీన ఒక్కరోజే 223.25 కోట్ల అమ్మకాలు
గత ఏడాదితో పోల్చితే కొత్త రికార్డులు
ఎక్సైజ్‌శాఖకు కాసుల పంట
హైదరాబాద్, అక్టోబర్ 19 (ఆంధ్రజ్యోతి): దసరా పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. గతేడాది దసరా సీజన్‌తో పోలిస్తే.. ఈసారి మద్యం అమ్మకాల ఊపు పెరిగింది. దీంతో ఎక్సైజ్ శాఖ ఖజానా కాసులతో గలగలలాడుతోంది. బోనాల ఉత్సవాల నుంచి మొదలయ్యే మద్యం అమ్మకాల జోష్.. దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూఇయిర్ నుంచి సంక్రాంతి వరకు కొనసాగుతుంటుంది. ప్రస్తుతం దసరాకు మూడు నాలుగు రోజుల ముందు నుంచే మద్యం డిపోలు, వైన్ షాపులు, బార్ల వద్ద సందడి మొదలైంది. అక్టోబర్ 17న ఒక్క రోజే రూ.223.25 కోట్ల విలువైన మద్యం విక్రయాలు నమోదయ్యాయి.
గత ఏడాది ఇదే తేదీన నమోదైన రూ.89.28 కోట్లతో పోలిస్తే.. ఇది రెండున్నర రెట్లు అధికం. ఈ నెల 1వ తేదీ నుంచి 17వ తేదీ నాటికి జరిగిన అమ్మకాల విలువ రూ.1751 కోట్లు. గత ఏడాది ఇదే వ్యవధిలో నమోదైన అమ్మకాలు రూ.1311 కోట్లు. అంటే, 33.5 శాతం పెరుగుదల నమోదైంది. రాష్ట్రంలో 2620 మద్యం దుకాణాలు, 1133 బార్లు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి దసరా సీజన్‌లో మద్యం అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. గత ఏడాది దసరా పండుగ అక్టోబరు 2వ తేదీన రాగా.. దానికి ముందు మూడు రోజుల్లోనే డిపోల నుంచి దుకాణాలకు రూ.697.23 కోట్ల విలువైన మద్యం సరఫరా జరిగింది. ఈ ఏడాది కూడా దసరాకు ముందు మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి.
ఈ నెల 14న రూ.102.17 కోట్ల విలువైన విక్రయాలు జరగ్గా.. 16న రూ.126.32 కోట్లు, 17న రూ.223.25 కోట్లు, 19వ తేదీ సాయంత్రం నాటికి ఏకంగారూ.350 కోట్లకుపైగా విక్రయాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రతి నెలా సాధారణంగా రూ.150 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. దేశంలో అత్యధికంగా మద్యం విక్రయాలు జరిగే రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళనాడు తర్వాత తెలంగాణ మూడో స్థానంలో ఉన్నప్పటికీ.. మొత్తం రాష్ట్ర పన్నురాబడిలో మద్యం వాటా శాతంలో మాత్రం తెలంగాణే మొదటి స్థానంలో కొనసాగుతోంది. 2024-25లో మద్యం విక్రయాలతో ప్రభుత్వానికి లభించిన ఆదాయం రూ.37,488 కోట్లు కాగా.. 2025-26 అది రూ.40,209 కోట్లుకు పెరిగింది.
ఈ వార్తలు కూడా చదవండి
గ్రామాల్లో తాగునీటి సమస్య రావొద్దు: సీతక్క
ఆర్టీసీ చైర్మన్‌గా బొంతు రామ్మోహన్!
Read Latest AP News And Telangana News And International