గ్రామాల్లో తాగునీటి సమస్య రావొద్దు: సీతక్క
ABN , Publish Date - Oct 20 , 2026 | 04:25 AM
రాష్ట్రంలో కరువు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి... గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా కృషి చేస్తానని మంత్రి సీతక్క తెలిపారు.
హైదరాబాద్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కరువు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి... గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా కృషి చేస్తానని మంత్రి సీతక్క తెలిపారు. ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు తగిన చర్యలపై సిఫారసు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీలో తనను సభ్యురాలిగా నియమించిన నేపథ్యంలో... పల్లెల్లో జల సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని సోమవారం మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వేసవికి ముందే నీటి సమస్యలు గుర్తించడం, అందుబాటులో ఉన్న నీటివనరులను సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు... ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందేలా అన్నిశాఖల సమన్వయంతో పనిచేస్తామని సీతక్క వెల్లడించారు.
కాగా, ఎల్‌నినో ప్రభావంతో తాగునీరు, విద్యుత్తు కొరత రాకుండా జిల్లా, మండల స్థాయిల్లో ప్రత్యామ్నాయ ప్రణాళికలను రూపొందించుకోవాలని సీఎస్ సంజయ్ జాజు సూచించారు. ఎల్‌నినో నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలకు ప్రభుత్వం నియమించిన సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరిశ్రమలకు ఎలాంటి విద్యుత్తు కోతలను అమలు చేయడం లేదని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్తును పొదుపుగా వినియోగించాలని ఆయన సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
రేషన్ షాపుల్లో గోదుమ పిండి, నిత్యావసరాలు!
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ వేగం పెంచాలి: భట్టి
34 నెలల్లో 12.4లక్షల పాసు పుస్తకాలు ఇచ్చాం
Read Latest AP News And Telangana News And International