Share News

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ వేగం పెంచాలి: భట్టి

ABN , Publish Date - Oct 20 , 2026 | 04:20 AM

ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి బడ్జెట్‌లో కేటాయించిన సబ్‌ప్లాన్‌ నిధుల పూర్తి స్థాయి వినియోగంలో వేగం పెంచాలని అధికారులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ వేగం పెంచాలి: భట్టి
Bhatti Vikramarka

హైదరాబాద్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి బడ్జెట్‌లో కేటాయించిన సబ్‌ప్లాన్‌ నిధుల పూర్తి స్థాయి వినియోగంలో వేగం పెంచాలని అధికారులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. కేటాయింపులకు అనుగుణంగా నిధుల వ్యయం వేగవంతం చేయడంతోపాటు వెనుకబడ్డ శాఖలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, సామాజిక, ఆర్థిక సాధికారతకు కేటాయించిన నిధుల వినియోగంలో ఎలాంటి జాప్యం ఉండకూడదన్నారు. సబ్‌ప్లాన్‌ నిధులు ఆయా వర్గాల సంక్షేమం, అభివృద్ధికి ఉపయోగపడేలా శాఖల వారీగా వ్యయ ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు.


నిధుల వినియోగంలో వెనుకబడిన శాఖలతో ప్రత్యేక సమీక్షలు నిర్వహించాలన్నారు. ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో సోమవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక శాఖలో సంస్కరణలు, ఆదాయ వనరుల సమీకరణ, రుణాల పునర్వ్యవస్థీకరణపై సమగ్ర కార్యాచరణను రూపొందించాలని చెప్పారు. నిర్దేశిత లక్ష్యాలకనుగుణంగా కేటాయించిన నిధుల ఖర్చుపై సంబంధిత శాఖలు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలోపేతానికి అందుబాటులో గల వనరుల సమర్థవంతంగా వినియోగించుకోవడంతోపాటు అదనపు ఆదాయ మార్గాలను గుర్తించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

రేషన్‌ షాపుల్లో గోదుమ పిండి, నిత్యావసరాలు!

ఎల్‌నినోతో ప్రపంచానికే ముప్పు

34 నెలల్లో 12.4లక్షల పాసు పుస్తకాలు ఇచ్చాం

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 20 , 2026 | 04:20 AM