Share News

ఎల్‌నినోతో ప్రపంచానికే ముప్పు

ABN , Publish Date - Oct 20 , 2026 | 04:06 AM

‘‘ఎల్‌నినో రూపంలో ప్రపంచానికే ఒక విపత్తు వచ్చింది. అది తెలంగాణకో, ఆంధ్రాకో, భారతదేశానికో రాలేదు. అవగాహన లేకుండా ప్రతిపక్షాలు ఎల్‌నినో విపత్తును ఓ నెపంగా చూపుతూ దాన్ని రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మోపడం సిగ్గుచేటు’’ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు.

ఎల్‌నినోతో ప్రపంచానికే ముప్పు
Thummala Nageswara Rao

  • విపత్తును సర్కార్‌పై మోపడం సిగ్గుచేటు

  • దేశంలో కొనడానికి కరెంట్‌ దొరకడం లేదు

  • రైతులు ఆరుతడి పంటలు వేయాలి: తుమ్మల

జూలూరుపాడు/అశ్వాపురం, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): ‘‘ఎల్‌నినో రూపంలో ప్రపంచానికే ఒక విపత్తు వచ్చింది. అది తెలంగాణకో, ఆంధ్రాకో, భారతదేశానికో రాలేదు. అవగాహన లేకుండా ప్రతిపక్షాలు ఎల్‌నినో విపత్తును ఓ నెపంగా చూపుతూ దాన్ని రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మోపడం సిగ్గుచేటు’’ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. సోమవారం ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు, అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలో పర్యటించి సీతారామ టన్నెల్‌, దుమ్ముగూడెం ఆనకట్ట ప్రాంతాలను పరిశీలించారు. వెలుగుమట్ల మోడల్‌ హౌసింగ్‌ కాలనీ పనులు పరిశీలించి సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది విజయదశమి నాటికి సీతారామ టన్నెల్‌ నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దేశంలో కొనడానికి కరెంట్‌ కూడా దొరకడం లేదని, భూమిలో నీళ్లు కూడా లేవని, ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఆరుతడి పంటలు వేయాలని సూచించారు. ఎల్‌నినో ప్రపంచాన్నే గడగడలాడిస్తుంటే.. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఇది కాంగ్రెస్‌ కరువని మాట్లాడం మంచిదికాదని మండిపడ్డారు. కాగా, ఖమ్మం సమీపంలో వెలుగుమట్లలో పేదల కోసం నిర్మిస్తున్న మోడల్‌కాలనీని డిసెంబరు 9న సీఎం రేవంత్‌రెడ్డితో ప్రారంభింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నవంబరు 15నాటికి ఇళ్ల నిర్మాణంతోపాటు మౌలిక సదుపాయాలు పూర్తి కావాలన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

తగ్గిన విద్యుత్‌ డిమాండ్‌

‘ఎల్‌నినో’పై మంత్రివర్గ ఉపసంఘం

దేవాదాయ శాఖలో అక్రమాలపై.. విజిలెన్స్‌ నివేదికలు బుట్టదాఖలు

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 20 , 2026 | 04:06 AM