తగ్గిన విద్యుత్ డిమాండ్
ABN , Publish Date - Oct 20 , 2026 | 03:52 AM
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా తగ్గింది. ఈ నెల 15న గరిష్ఠ డిమాండ్ 20,003 మెగావాట్లుగా నమోదు కాగా... మరుసటి రోజు 20,018 మెగావాట్లకు పెరిగింది.
17,756 మెగావాట్లకు తగ్గిన వైనం
హైదరాబాద్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా తగ్గింది. ఈ నెల 15న గరిష్ఠ డిమాండ్ 20,003 మెగావాట్లుగా నమోదు కాగా... మరుసటి రోజు 20,018 మెగావాట్లకు పెరిగింది. ఆ తర్వాత నుంచీ విద్యుత్ డిమాండ్ క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ నెల 17న 19,382 మెగావాట్లు, 18న 18,092 మెగావాట్ల డిమాండ్ ఉండగా, సోమవారం ఉదయం 9:57 గంటల సమయంలో 17,756 మెగావాట్లకు తగ్గిపోయింది. దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది సొంతూళ్లకు వెళ్లడంతో ఏసీల వినియోగం బాగా తగ్గిందని, దీనికితోడు వాతావరణం కాస్త చల్లబడడంతో విద్యుత్ డిమాండ్ తగ్గిందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వ్యవసాయ వినియోగం కూడా కాస్త తగ్గిందని చెబుతున్నారు. ఈనెల 18న రాష్ట్రంలో 319 మిలియన్ యూనిట్లను వినియోగించగా, బహిరంగ విపణిలో 96మిలియన్ యూనిట్లను సగటున రూ.4.94కు కొనుగోలు చేశారు. జెన్‌కో థర్మల్ కేంద్రాల్లో 7,180మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్లను నడిపించి...100 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేసి, గ్రిడ్‌కు అందించారు. ఈ ప్లాంట్ల ఉత్పాదక సామర్థ్యం 63.37శాతంగా నమోదైంది. డిమాండ్ తగ్గడంతో విద్యుత్ పంపిణీ సంస్థలు ఊపిరి పీల్చుకున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
నెట్ జీరో క్యాంప్‌సగాఎన్‌ఐయూఎం ప్రాంగణం
‘ఎల్‌నినో’పై మంత్రివర్గ ఉపసంఘం
Read Latest AP News And Telangana News And International