‘ఎల్‌నినో’పై మంత్రివర్గ ఉపసంఘం
ABN , Publish Date - Oct 20 , 2026 | 03:43 AM
ఎల్‌నినోను ఎదుర్కోవడానికి అవసరమైన సూచనలు, సలహాలు అందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.
చైర్మన్‌గా డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క
సభ్యులుగా ఉత్తమ్, పొంగులేటి, సీతక్క, తుమ్మల, వాకిటి
హైదరాబాద్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినోను ఎదుర్కోవడానికి అవసరమైన సూచనలు, సలహాలు అందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రివర్గ ఉపసంఘానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క చైర్మన్‌గా ఉంటారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి సభ్యులుగా ఉన్నారు.
రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులు, కరువును అధిగమించడానికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వడానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ప్రణాళిక శాఖ కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ప్రభుత్వ సలహాదారు కె.రామకృష్ణారావు ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉంటూ ఎల్‌నినో పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఉపసంఘంతో సమన్వయం చేస్తారని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో పరిస్థితులను మంత్రివర్గ ఉపసంఘం నిరంతరం సమీక్షిస్తూ.. సంబంధిత శాఖలకు అవసరమైన ఆదేశాలు జారీ చేస్తుంది. ఎల్‌నినో, కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రభుత్వానికి సిఫారసులు చేస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి
నెట్ జీరో క్యాంప్‌సగాఎన్‌ఐయూఎం ప్రాంగణం
Read Latest AP News And Telangana News And International