2 నెలల్లో రేడియల్ రోడ్డు
ABN , Publish Date - Oct 20 , 2026 | 03:24 AM
గ్లోబల్ సమ్మిట్ మొదలయ్యే నాటికి ప్యూచర్ సిటీకి కొత్తకళ తేవాలన్న లక్ష్యంతో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అక్కడ అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
గ్లోబల్ సమ్మిట్ నాటికి సిద్ధమవ్వాలి..
స్కిల్స్ వర్సిటీ కూడా పూర్తవ్వాలి
అధికారులకు సీఎం ఆదేశం..
ఫ్యూచర్ సిటీలో 3 గంటల పర్యటన
హెలికాప్టర్‌లోనే పనుల పర్యవేక్షణ..
అంశాల వారీ సమీక్ష
ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ప్రారంభం
‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్’కు శంకుస్థాపన
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి)
గ్లోబల్ సమ్మిట్ మొదలయ్యే నాటికి ప్యూచర్ సిటీకి కొత్తకళ తేవాలన్న లక్ష్యంతో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అక్కడ అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్యూచర్ సిటీలో మూడు గంటల పాటు పర్యటించారు. ఇబ్రహీంపట్నంలో ఆక్టోపస్ క్యాంప్‌సలో ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవనాన్ని ప్రారంబించారు. ప్రత్యేక పూజల అనంతరం ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ లోగోను ఆవిష్కరించి, కమిషనర్ తరుణ్ జోషిని వేద మంత్రాల నడుమ కూర్చీలో కూర్చోపెట్టారు. అనంతరం హెలీకాఫ్టర్‌లో ప్యూచర్ సిటీలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు.
రావిర్యాల నుంచి ఆమన్‌గల్ వరకు 330 అడుగుల వెడల్పుతో 44 కిలోమీటర్ల పొడవున చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణ పనులను హెలీకాఫ్టర్ నుంచి పరిశీలించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ పనులను గంటకు పైగా పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. మీర్‌ఖాన్‌పేట వద్ద జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. ప్యూచర్ సిటీ అథార్టీ భవన సముదాయంలో ఎన్‌ఐయూఎం(నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌అర్బన్ మేనేజ్‌మెంట్) క్యాంపస్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం డిసెంబర్‌లో జరిగే గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఎట్టి పరిస్థితుల్లో గ్లోబల్ సమ్మిట్ నాటికి రతన్ టాటా రేడియల్ రోడ్డు, స్కిల్ వర్శిటీ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్కిల్ వర్సిటీ ప్రాంగణంలో జరిగే గ్లోబల్ సమిట్ ఏర్పాట్లు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని చెప్పారు. గడువులోగా పూర్తయ్యేందుకు సిబ్బంది సంఖ్యను పెంచాలన్నారు. నవంబరు ఆఖరులోగా ఏర్పాట్లు పూర్తి కావాలని స్పష్టం చేశారు. మైదానాన్ని నవంబరు 15కే సిద్ధం చేయాలన్నారు. తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చే సదస్సును ప్రణాళికాబద్ధంగా నిర్వహించాన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
గోదావరి-కావేరీ లింకు పేరుతో కుట్ర:హరీశ్
Read Latest AP News And Telangana News And International