90 శాతం మంది అర్హులే సర్
ABN , Publish Date - Oct 20 , 2026 | 03:15 AM
ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో నోటీసులు అందుకున్న వారిలో 90శాతం మంది అర్హులేనని ప్రాథమికంగా తేలింది.
సర్ ప్రక్రియలో మొత్తం 92.88 లక్షల మందికి నోటీసులు
విచారణలో 84,03,289 మంది అర్హులుగా నిర్ధారణ
వారి పేర్లను ఓటరు జాబితాలో చేర్చడమే తరువాయి
నోటీసులకు స్పందించనివారు 3 లక్షల మంది!
హైదరాబాద్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో నోటీసులు అందుకున్న వారిలో 90శాతం మంది అర్హులేనని ప్రాథమికంగా తేలింది. 2002 ఎస్‌ఐఆర్‌లో లేకపోవడం, నోమ్యాపింగ్, చిరునామా, ఇతర వివరాల్లో తప్పులకు సంబంధించి.. రాష్ట్రవ్యాప్తంగా 92.88 లక్షల మందికి నోటీసులు జారీచేశారు. వాటిలో 89.75లక్షల నోటీసులపై ఎన్నికల సంఘం విచారణ పూర్తిచేసింది. ఇప్పటి వరకు పూర్తిచేసిన నోటీసుల పరిశీలన ఆధారంగా.. నోటీసులు అందుకున్న 92.88 లక్షల మందిలో 84.03 లక్షల మంది తుది ఓటరు జాబితాలో ఉండడానికి అర్హులేనని తేలినట్లు సమాచారం.
వీరిని ఇక అధికారికంగా తుది ఓటరు జాబితాలో చేర్చడమే తరువాయి. ఈ మేరకు జిల్లాలవారీగా నోటీసులు, విచారణలు, ధ్రువీకరణల స్థితికి సంబంధించిన నివేదికను ఎన్నికల సంఘం సోమవారం నాటికి సిద్ధం చేసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. విచారణ పూర్తయినవాటిలో 31,063 కేసులను మాత్రమే తుది ప్రచురణకు అనర్హమైనవిగా అధికారులు గుర్తించారు. తుది ఓటరు జాబితాలో ఉండేందుకు అర్హులైన 84.03 లక్షల మందిలో.. 56,86,890 మంది లాజికల్ డిస్ర్కిపెన్సీ కేటగిరీలో ఉన్నారు.
ఓటరు సమర్పించిన వివరాలకు, పాత జాబితాలోని వివరాలకు తేడా ఉంటే దాన్ని లాజికల్ డిస్ర్కిపెన్సీగా పరిగణిస్తారు. ఇక.. నో మ్యాపింగ్‌లో 27,16,465 మంది పేర్లు ఉన్నట్లు తెలిసింది. పాత (2002) జాబితాతో అనుసంధానం కానివాటిని నో మ్యాపింగ్ కేసులంటారు. నవంబరు 9న ప్రకటించే తుది ఓటరు జాబితాలో వీరందరి పేర్లు ఉండనున్నాయని సమాచారం. 22,457 మంది ఓటర్లకు నోటీసులు జారీచేసినా.. అవి ఇంకా వారికి చేరలేదు.
సర్ నోటీసులు అందుకున్నా విచారణకు రానివారి సంఖ్య 3,02,925. మరో 9,699 కేసుల్లో వారికిచ్చిన సమయాన్ని రీషెడ్యూల్ చేసిన తేదీ కూడా దాటింది. వారికి సంబంధించి.. మరోసారి రీషెడ్యూల్ చేసి.. నోటీసులు ఓటరు ఇంటికి వెళ్లిఇచ్చి, అక్కడే తగిన ధ్రువీకరణ పత్రాలు సేకరించాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రంలో ఎన్నికల అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.
ఇదీ లెక్క
రాష్ట్రంలో మొత్తం ఓటర్లు: 3,38,26,448
ఎన్యూమరేషన్ ఫామ్‌లు ఇచ్చినవారు: 2,64,87,213
ఏఎ్‌సడీడీ (యాబ్సెంట్, షిఫ్టెడ్,
డెడ్, డూప్లికేట్) కేటగిరీలో ఉన్నవారు: 73.39 లక్షలు
నోటీసులు డెలివరీ అయినది: 92,65,731
నోటీసు డెలివరీ పెండింగ్: 22,457
విచారణకు హాజరైనవారు: 89,75,562
గడువు ముగిసినా విచారణకు రానివారు: 3,02,925
రీషెడ్యుల్ గడువు ముగిసినా రానివారు: 9,699
ఈ వార్తలు కూడా చదవండి
గోదావరి-కావేరీ లింకు పేరుతో కుట్ర:హరీశ్
క్యూనెట్ కేసు కీలక నిందితుడు డిగ్ విజయ్‌సింగ్ అరెస్టు
Read Latest AP News And Telangana News And International