రేషన్ షాపుల్లో గోదుమ పిండి, నిత్యావసరాలు!
ABN , Publish Date - Oct 20 , 2026 | 04:12 AM
ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
పరిశీలించాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం
ఎల్‌నినో నేపథ్యంలో సమీక్ష.. ముందస్తు సన్నద్ధతపై చర్చ
హైదరాబాద్, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజాపంపిణీ వ్యవస్థపై ఆధారపడిన 3.42 కోట్ల మంది ప్రజల ఆహార భద్రతకు భరోసా కల్పిస్తూ 14నెలల అవసరాలకు సరిపడా ప్రణాళికలు రూపొందించాలన్నారు. పేద కుటుంబాలపై ధరల భారాన్ని తగ్గించేందుకు రేషన్ షాపుల ద్వారా గోదుమపిండి, ఎంపిక చేసిన నిత్యావసరాలు (కందిపప్పు, పామాయిల్, చక్కెర, చింతపండు, కారం) అందించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. ఇందుకోసం ఎంత ఖర్చవుతుందనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు
. సచివాలయంలో సోమవారం తన కార్యాలయంలో పౌరసరఫరాల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాబోయే సీజన్లలో వర్షపాతం తగ్గినా రేషన్ సరఫరాకు అంతరాయం కలగకుండా ధాన్యం సేకరణ, బియ్యం నిల్వల నిర్వహణకు ముందుగానే కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రజాపంపిణీ వ్యవస్థ, ఇతర సంక్షేమ పథకాలకు కలిపి నెలకు 2.38 లక్షల టన్నుల బియ్యం అవసరం ఉందని, ఏడాదికి 28.56లక్షల టన్నులు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
అక్టోబరు 16 నాటికి రాష్ట్రంలోని బఫర్ గోదాముల్లో 9.64 లక్షల టన్నుల బియ్యం అందుబాటులో ఉన్నాయని, పెండింగ్‌లో ఉన్న కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్), ఇతర గుర్తించిన సరఫరాల ద్వారా మరో 18.39లక్షల టన్నుల బియ్యం అందాల్సి ఉందని పేర్కొన్నారు. 2027 సెస్టెంబరు వరకు ఈ బియ్యం సరిపోతాయని వివరించారు. ఈ మేరకు ఉత్తమ్ స్పందిస్తూ.. మిల్లర్లు, ఇతర వనరుల నుంచి రావాల్సిన బియ్యం నిర్ణీత గడువులోగా గోదాములకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
దేవాదాయ శాఖలో అక్రమాలపై.. విజిలెన్స్ నివేదికలు బుట్టదాఖలు
Read Latest AP News And Telangana News And International