Share News

ఆర్టీసీ చైర్మన్‌గా బొంతు రామ్మోహన్‌!

ABN , Publish Date - Oct 20 , 2026 | 04:30 AM

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) చైర్మన్‌గా బొంతు రామ్మోహన్‌ను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.

ఆర్టీసీ చైర్మన్‌గా బొంతు రామ్మోహన్‌!
Bonthu Rammohan

  • దసరా తర్వాత ఉత్తర్వులు వెలువడే అవకాశం

హైదరాబాద్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) చైర్మన్‌గా బొంతు రామ్మోహన్‌ను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ చైర్మన్‌ పదవీ ఖాళీగానే ఉంది. త్వరలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నందున సంస్థ చైర్మన్‌ నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఒకటి, రెండు పేర్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నప్పటికీ బొంతు రామ్మోహన్‌వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది.


ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు దసరా పండుగ తర్వాత వెలువడే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌, ఎండీ ఆధ్వర్యంలోనే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అయితే, సంస్థకు, ప్రభుత్వానికి మధ్య కీలకంగా ఉండే చైర్మన్‌ పదవి ఖాళీగా ఉండడం, గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతిచ్చిన కార్మిక సంఘం ఆశించిన ఫలితాలు సాధించకపోవడం వంటి పరిణామాల దృష్ట్యా చైర్మన్‌ నియామకం తర్వాతే ఉద్యోగుల విలీనం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి

గ్రామాల్లో తాగునీటి సమస్య రావొద్దు: సీతక్క

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ వేగం పెంచాలి: భట్టి

34 నెలల్లో 12.4లక్షల పాసు పుస్తకాలు ఇచ్చాం

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 20 , 2026 | 04:30 AM