Share News

ఏంటిది గూగుల్‌.. రూట్‌ మ్యాప్‌ను నమ్మి ఆర్వోబీపైకి ట్రక్కు తోలిన డ్రైవర్‌

ABN , Publish Date - Jul 03 , 2026 | 11:07 AM

గూగుల్‌ మ్యాప్‌ చూపిన మార్గాన్ని నమ్మి ఓ ట్రక్కు డ్రైవర్‌ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిపైకి ట్రక్కును తీసుకెళ్లాడు.

ఏంటిది గూగుల్‌.. రూట్‌ మ్యాప్‌ను నమ్మి ఆర్వోబీపైకి ట్రక్కు తోలిన డ్రైవర్‌
Google Maps

  • అసంపూర్తిగా ఉందని గమనించి ఆపడంతో తప్పిన ముప్పు

కాజీపేట(వరంగల్): గూగుల్‌ మ్యాప్‌ చూపిన మార్గాన్ని నమ్మి ఓ ట్రక్కు డ్రైవర్‌ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిపైకి ట్రక్కును తీసుకెళ్లాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత బ్రిడ్జి పూర్తికాలేదని గుర్తించి, ఒక్కసారిగా ట్రక్కును ఆపడంతో పెనుప్రమాదం తప్పింది. వివరాలు ఇలా ఉన్నాయి... వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ఓ గూడ్స్‌ ట్రక్కు డ్రైవర్‌ గూగుల్‌ మ్యాప్‌ చూసుకుంటూ గురువారం తెల్లవారుజామున కాజీపేట ఫాతిమానగర్‌ వద్ద నిర్మాణంలో ఉన్న ఆర్వోబీ పైకి ట్రక్కు ఎక్కించారు.


hnk2.jpgముందుకువెళ్లగానే ముందు భాగంలో బ్రిడ్జిలేదు. దీంతో ఒక్కసారిగా సడన్‌బ్రేక్‌ వేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. షాక్‌కు గురైన డ్రైవర్‌ వెంటనే ట్రక్కును ఆపారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు నిర్మాణంలో ఉన్న ఆర్వోబీపై ప్రమాద హెచ్చరికలు లేకపోవడం కూడా ఒక కారణమే స్థానికులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

చర్లపల్లి-షాలిమార్‌ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లు

కోడిగుడ్డు అ‘ధర’హో!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 03 , 2026 | 11:11 AM