ఫుల్లుగా తాగేశారు.. దసరాకు రూ.68.93 కోట్ల మద్యం అమ్మకాలు
ABN , Publish Date - Oct 23 , 2026 | 01:48 PM
దసరా పండుగ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని 295 వైన్ షాపులు, 139 బార్ అండ్ రెస్టారెంట్లకు రూ.68.93కోట్ల మద్యాన్ని లిక్కర్ డిపోల నుంచి విక్రయించినట్లుగా ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు.
వరంగల్ క్రైం: దసరా పండుగ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని 295 వైన్ షాపులు, 139 బార్ అండ్ రెస్టారెంట్లకు రూ.68.93కోట్ల మద్యాన్ని లిక్కర్ డిపోల నుంచి విక్రయించినట్లుగా ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 20న దసరా పండుగ జరగగా 17న రూ.38.10 కోట్ల విలువ చేసే 27,211 కేసుల లిక్కర్, 72,885 కేసుల బీర్లు అమ్ముడుపోగా, 18న అదివారం సెలవు పోగా, 19న రూ.30.42కోట్ల విలువ చేసే 24,491 కేసులు లిక్కర్, 49,803 కేసుల బీర్లు విక్రయాలు జరిగాయి. ఓవరాల్‌గా ఈ నెల 1 నుంచి 19వ తేదీవరకు విక్రయాలను పరిశీలించినట్లయితే రూ.222.13 కోట్ల విలువ చేసే 3,64,998 కేసుల లిక్కర్, 1,75,430 కేసుల బీర్లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సేల్ అయ్యాయి.
ఈ లెక్కన ఒక్కరోజుకు సగటున రూ.11 కోట్లకు పైగా మద్యం సేల్ కాగా, దసరా సందర్భంగా రెండు రోజుల్లోనే రూ.68.93కోట్ల మద్యం అమ్ముడుపోయి ఎక్సైజ్‌శాఖ ద్వారా ప్రభుత్వానికి అదనంగా ఆదాయం సమకూరింది. ఈ నెల 1 నుంచి 19 వరకు జిల్లాల వారీగా జరిగిన విక్రయాల్లో వరంగల్ అర్బన్‌లోని మద్యం షాపులు రూ.83.63 కోట్లతో ముందంజలో ఉండటం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి:
కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సులు డీలా..!
తెలంగాణ అభివృద్ధిలో ఎస్పీఎఫ్ పాత్ర కీలకం: భట్టి విక్రమార్క
Read Latest AP News And Telangana News And International News And Telugu News