Share News

నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Nov 12 , 2026 | 04:46 AM

తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందించి, ప్రపంచ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం
Bhatti Vikramarka

  • ప్రపంచ స్థాయిలో పోటీపడేలా తెలంగాణ విద్యావ్యవస్థను తీర్చిదిద్దుతాం: భట్టి విక్రమార్క

  • కాజీపేటలో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌కు శంకుస్థాపన

కాజీపేట, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందించి, ప్రపంచ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా కాజీపేటలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. విద్య ద్వారానే సమాజంలో సమానత్వం, అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.


అందుకే విద్యారంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. మహాత్మాగాంధీ స్ఫూర్తి, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ఆశయాలకు అనుగుణంగా దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు, తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో విద్యారంగాన్ని బలోపేతం చేసి, ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే స్థాయికి తెలంగాణ విద్యావ్యవస్థను తీసుకెళ్లడమే ప్రభుత్వ సంకల్పమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి.

ఆంధ్రకు నీళ్లు.. తెలంగాణకు ఎక్కిళ్లు

ప్రజాస్వామ్య పరిరక్షణకే భారత్‌ సమ్మిట్‌ 2.0

వరి పంట తప్ప..!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 04:46 AM