Share News

పార్టీ నేతలతో టీబీజేపీ చీఫ్ రాంచందర్‌ రావు భేటీ.. కీలక అంశాలపై చర్చ

ABN , Publish Date - Aug 29 , 2026 | 01:31 PM

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మరో పోరుబాటకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రాంచందర్ రావు అధ్యక్షతన నేడు మధ్యాహ్నం కీలక సమావేశం జరగనుంది.

పార్టీ నేతలతో టీబీజేపీ చీఫ్ రాంచందర్‌ రావు భేటీ.. కీలక అంశాలపై చర్చ

హైదరాబాద్, ఆగస్టు 29: తెలంగాణలో తమ పార్టీని బలోపేతం చేసే దిశగా బీజేపీ కసరత్తులు చేస్తోంది. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు తమ గొంతుకను వినిపిస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ చీఫ్ రాంచందర్ రావు అధ్యక్షతన ఫీజు బకాయిల చెల్లింపు కోసం ఇటీవల దీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. మరో రెండు పోరాటాలకు బీజేసీ నాయకులు సన్నద్ధమవుతున్నారు.


22-ఏలో చేర్చిన భూమి సంబంధించిన బాధితులకు అండగా నిలిచేందుకు వచ్చే నెల 5,6 తేదీల్లో టీబీజేపీ నేతలు మరో దీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు(శనివారం) రాంచందర్ రావు అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ భేటీలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో 22-ఏ వ్యవహారంపై చేసే దీక్షపై సుదీర్ఘంగా చర్చ జరగనున్నట్లు సమాచారం. దీక్షకు సంబంధించిన కార్యాచరణపై రాంచందర్ రావు నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో పార్టీ బలాబలాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. పార్టీని బలోపేతం చేసే దిశలో భవిష్యత్తు కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశం అనంతరం బీజేపీ తదుపరి కార్యాచరణపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.


పాయల్ శంకర్ ‘రైతు యాత్ర’

మరోవైపు ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ నుంచి అసెంబ్లీ వరకు రైతుయాత్ర చేపట్టేందుకు పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ సిద్ధమవుతున్నారు.


ఇవీ చదవండి:

నేపాల్ వరదల్లో గల్లంతైన హైదరాబాదీ కుటుంబం.. రంగంలోకి సర్కార్!

కొత్త కారు పూజ కోసం వచ్చి.. అదే కారు కింద పడి..

Updated Date - Aug 29 , 2026 | 01:42 PM