వికారాబాద్‌లో అగ్నిప్రమాదం.. ఇంట్లో సిలిండర్లు పేలినట్లు అనుమానం
ABN , Publish Date - Nov 24 , 2026 | 03:24 PM
వికారాబాద్ జిల్లాలోని దోమ మండలం ఊట్‌పల్లి గ్రామంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గ్రామంలోని ఓ ఇంట్లో పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు.
వికారాబాద్ జిల్లా, నవంబర్ 24: జిల్లాలోని దోమ మండలం ఊట్‌పల్లి గ్రామంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గ్రామంలోని ఓ ఇంట్లో పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. సంజీవ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇంట్లోని రెండు సిలిండర్లు పేలడం వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సంజీవ రెడ్డి కుటుంబం పొలానికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. అయితే మంటలు అదుపులోకి రానట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సంజీవరెడ్డి కుటుంబసభ్యులు కూడా అక్కడకు చేరుకున్నారు. కళ్ల ముందే ఇళ్లు మొత్తం మంటల్లో కాలిపోతుండటంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ కేసులో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు ప్రణయ్
హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు కేసు.. డిస్పోజబుల్ మెయిల్ ఐడీతో మెసేజ్
Read Latest Telangana News And Telugu News