Share News

మారుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి రైతులు పంట మార్పిడి చేసుకోవాలి

ABN , Publish Date - Nov 29 , 2026 | 01:51 AM

ఆయిల్‌పామ్‌కు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని, రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా కార్యాచరణ రూపొందించామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

మారుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి రైతులు పంట మార్పిడి చేసుకోవాలి

  • 10 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యం

  • వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

మొయినాబాద్‌, నవంబరు 28: (ఆంధ్రజ్యోతి): ఆయిల్‌పామ్‌కు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని, రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా కార్యాచరణ రూపొందించామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం రంగారెడ్డి జిల్లా మొయునాబాద్‌ మండల పరిధిలోని డ్రీమ్‌ వ్యాలీ రిసార్ట్‌లో రాష్ట్ర ఆయిల్‌పామ్‌ గ్రోయర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తుమ్మల మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంట మార్పిడి చేసుకోవాలని సూచించారు.


సంప్రదాయ పంటలతో పాటు ఆయిల్‌పామ్‌, ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఆయిల్‌పామ్‌ రైతుల సమస్యలు, సందేహాల పరిష్కారం కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతులంతా కలిసి మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. అన్ని జిల్లాల ఆయిల్‌పామ్‌ అసోసియేషన్‌ అధ్యక్షులను మంత్రి సన్మానించారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి, అసోసియేషన్‌ నాయకులు రాజేంద్రప్రసాద్‌, చింపుల సత్యనారాయణరెడ్డి, మహేందర్‌ ముదిరాజ్‌, హన్మంత్‌ యాదవ్‌, అశోక్‌ యాదవ్‌, ఆగిరెడ్డి, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు

నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. విదేశీ ఉద్యోగాల కోసం కొత్త పథకానికి శ్రీకారం

పోలీస్ శాఖలో అవినీతికి పాల్పడితే ఎవరినీ ఉపేక్షించం: డీజీపీ ఆనంద్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 29 , 2026 | 01:52 AM