Share News

అతివేగం.. అంతులేని విషాదం!

ABN , Publish Date - Nov 04 , 2026 | 06:33 AM

అర్ధరాత్రి వేళ అతివేగం.. అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టడంతో దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు.

అతివేగం.. అంతులేని విషాదం!
Road Accident

  • డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టిన కారు.. దంపతుల మృతి

కంది/శంకర్‌పల్లి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): అర్ధరాత్రి వేళ అతివేగం.. అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టడంతో దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం గాజులగూడెం గ్రామానికి చెందిన ఎల్లకొండ నరసింహులు (40), ఆయన భార్య నవనీత (33) కారులో శంకర్‌పల్లి నుంచి సంగారెడ్డికి బయలుదేరారు. కంది గ్రామ సమీపంలోని మూలమలుపు వద్దకు చేరుకోగానే కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొని పల్టీలు కొట్టింది.


ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. దంపతులకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి అతివేగమే కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. దంపతుల మృతికి సంతాపంగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం గాజులగూడకు చేరుకుని అత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. కాగా, నరసింహులు శంకర్‌పల్లి మండల బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈ దంపతలకు హర్షవర్ధన్‌ (5వ తరగతి), మోక్షిత్‌ (3వ తరగతి) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లిండ్రుల మృతితో ఆ చిన్నారులు దిక్కులేనివారయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే ‘అడిగినంత’ జీతం

కోట్లకొద్దీ నకిలీ నోట్లు!

ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 06:33 AM