Share News

రూ.3.36 కోట్ల ప్రభుత్వ ధాన్యం మాయం

ABN , Publish Date - Nov 14 , 2026 | 06:48 AM

వికారాబాద్‌ జిల్లా కులకచర్లలోని శ్రీవిశాలాక్షి ఇండస్ట్రీస్‌ రైస్‌మిల్లులో రూ.3.36 కోట్లకుపైగా విలువ చేసే ప్రభుత్వ ధాన్యం మాయమైంది.

రూ.3.36 కోట్ల ప్రభుత్వ ధాన్యం మాయం
Telangana Paddy Scam

  • విశాలాక్షి రైసు మిల్లుపై కేసు నమోదు

కులకచర్ల, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్‌ జిల్లా కులకచర్లలోని శ్రీవిశాలాక్షి ఇండస్ట్రీస్‌ రైస్‌మిల్లులో రూ.3.36 కోట్లకుపైగా విలువ చేసే ప్రభుత్వ ధాన్యం మాయమైంది. ఈ మేరకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో సదరు రైస్‌మిల్లుపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2022-23, 2023-24 యాసంగి సీజన్‌లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం సదరు రైస్‌ మిల్లుకు ధాన్యం అప్పగించింది. ఆగస్టు 21న నిర్వహించిన తనిఖీల్లో రైస్‌మిల్లులో 812.227 క్వింటాళ్ల ధాన్యం కొరత ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. ఈ నెల 11న పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ప్రభుత్వానికి అందించాల్సిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ను పూర్తిస్థాయిలో అప్పగించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో జరిమానాలు, వడ్డీతో కలిపి ప్రభుత్వానికి రూ.3,36,71,560 నష్టం వాటిల్లినట్లు వికారాబాద్‌ జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ నరసింహారెడ్డి తెలిపారు. ఈ మేరకు రైస్‌మిల్లు భాగస్వామి మగ్ధ రవితేజతో పాటు మరో ముగ్గురిపై కులకచర్ల పోలీసులు కేసు నమోదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 14 , 2026 | 06:48 AM