తొలి దివ్యాంగ పింఛనుతో తోటి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ
ABN , Publish Date - Nov 29 , 2026 | 01:41 AM
తొలిసారిగా తనకు మంజూరైన చేయూత పింఛను డబ్బుతో ఓ విద్యార్థి తోటి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశాడు.
దాతృత్వాన్ని చాటుకున్న విద్యార్థి
కులకచర్ల, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): తొలిసారిగా తనకు మంజూరైన చేయూత పింఛను డబ్బుతో ఓ విద్యార్థి తోటి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశాడు. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలంలోని చెల్లాపూర్ గ్రామానికి చెందిన చందు అనే విద్యార్థి దివ్యాంగుడు. స్థానిక ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు.
ఇటీవల అతడికి తెలంగాణ ప్రభుత్వం చేయూత పింఛను మంజూరు చేసింది. తొలిసారిగా రూ.4,016 పింఛను అందుకున్న చందు.. ఆ డబ్బులతో శనివారం స్నేహితులకు బుక్కులు, పెన్సిళ్లు, ఇతర సామగ్రిని కొనుగోలు చేసి అందించి దాతృత్వాన్ని చాటుకున్నాడు. ఈ సందర్భంగా చందు తండ్రి నరేశ్‌ను ఉపాధ్యాయులు సన్మానించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు
నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. విదేశీ ఉద్యోగాల కోసం కొత్త పథకానికి శ్రీకారం
పోలీస్ శాఖలో అవినీతికి పాల్పడితే ఎవరినీ ఉపేక్షించం: డీజీపీ ఆనంద్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News