Share News

ప్రసవం కోసం వచ్చిన నిండు గర్భిణి మృతి

ABN , Publish Date - Nov 01 , 2026 | 05:11 AM

ప్రసవం కోసం ప్రభుత్వాస్పత్రికి వచ్చిన ఓ నిండు గర్భిణి కడుపులో బిడ్డతో సహా మృతి చెందింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.

ప్రసవం కోసం వచ్చిన నిండు గర్భిణి మృతి
Radha

  • రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ ఆస్పత్రిలో ఘటన

  • వైద్యుల నిర్లక్షమే కారణమని భర్త ఆరోపణ

షాద్‌నగర్‌ రూరల్‌, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): ప్రసవం కోసం ప్రభుత్వాస్పత్రికి వచ్చిన ఓ నిండు గర్భిణి కడుపులో బిడ్డతో సహా మృతి చెందింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. కొందుర్గు మండలం చెర్కుపల్లి గ్రామానికి చెందిన గర్భిణి మల్లని రాధ (28)కు పురిటి నొప్పులు రావడంతో భర్త రమేశ్‌కుమార్‌ ఆమెను శుక్రవారం మధ్యాహ్నం కొందుర్గు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, అక్కడి వైద్యుల సూచనల మేరకు షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ పరీక్షించిన వైద్యులు అడ్మిట్‌ చేసుకుని చికిత్స ప్రారంభించారు.


రాత్రి 7.00 గంటల సమయంలో అకస్మాత్తుగా ఫిట్స్‌ రావడంతో హడావిడిగా ఆమెను హైదరాబాద్‌ తీసుకెళ్లాలని సూచించారు. తల్లి పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన వైద్యం అందిస్తే కనీసం కడుపులోని బిడ్డనైనా బతికించవచ్చని చెప్పడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు కడుపులో బిడ్డతో పాటు గర్భిణి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన భార్య మృతి చెందినట్లు రమేశ్‌కుమార్‌ ఆరోపించాడు.


అబార్షన్‌ చేయించడం వల్లే..: మృతురాలి తల్లి

రాధ, రమేశ్‌కుమార్‌ దంపతులకు ఆరేళ్ల లోపు వయసున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గతంలో మూడో కాన్పు సమయంలో స్కానింగ్‌ చేయించి మళ్లీ ఆడపిల్లేనని తెలుసుకున్న భర్త రమేశ్‌కుమార్‌.. వైద్యులు వద్దని చెబుతున్నా అబార్షన్‌ చేయించాడని మృతురాలి తల్లి లక్ష్మమ్మ కొత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైస్పీడ్ రైళ్ల మార్గాల ప‌నులను వేగ‌వంతం చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విన్నపం

ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి

ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 01 , 2026 | 05:12 AM