షాబాద్ హంతకుడు రాజ్‌కుమార్ మృతి
ABN , Publish Date - Jul 13 , 2026 | 04:32 PM
రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో బాలిక సహా ఆరుగురిని అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ కేసు హంతకుడు రాజ్‌కుమార్ మృతదేహం కొత్తూరు సమీపంలో లభ్యమైనట్లు చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్ వెల్లడించారు.
రంగారెడ్డి జిల్లా, జులై 13 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో బాలిక సహా ఆరుగురిని అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ కేసు హంతకుడు రాజ్‌కుమార్ (Shabad Accused Raj Kumar) మృతదేహం అతని మేనమామ ఊరు కొత్తూరు మండలం పంజర్లలో లభ్యమైనట్లు చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్ వెల్లడించారు.
డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు సమీపంలోని ఓ వెంచర్‌లో అనుమానాస్పద స్థితిలో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ మృతదేహం రాజ్‌కుమార్‌దేనని డీసీపీ ధ్రువీకరించారు.

రాజ్‌కుమార్ పాయిజన్ సేవించి ఆత్మహత్య చేసుకున్నాడని డీసీపీ పేర్కొన్నారు. ఘటనాస్థలిలో పాయిజన్ బాటిల్ లభ్యమైందని తెలిపారు. ఆ ఆధారాలను సేకరించిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.
కాగా, షాబాద్‌లో జరిగిన ఆరుగురి హత్యల ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టగా, ఈరోజు అతడి మృతదేహం లభ్యమైంది.
ఈ వార్తలు కూడా చదవండి...
దేవాలయాల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు: మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ మెగా ఆపరేషన్..
Read Latest AP News And Telangana News And National News
And Telugu News