షాబాద్ హంతకుడు రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
ABN , Publish Date - Jul 13 , 2026 | 06:31 PM
రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరు హత్యలకు ముందు రోజు హంతకుడు రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడని ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి తెలిపారు. మృతదేహం వద్ద లభించిన రాజ్‌కుమార్ సెల్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియోను గుర్తించినట్లు పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా, జులై 13 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరు హత్యలకు ముందు రోజు హంతకుడు రాజ్‌కుమార్ (Shabad Accused Raj Kumar Case) సెల్ఫీ వీడియో తీసుకున్నాడని ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి (CP Tarun Joshi) తెలిపారు. అతని మృతదేహం వద్ద లభించిన రాజ్‌కుమార్ సెల్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియోను గుర్తించినట్లు పేర్కొన్నారు. వీడియో రికార్డు వివరాల ఆధారంగా హత్యకాండకు ముందురోజు (జులై 10న) వీడియో రికార్డు చేసినట్లు గుర్తించామని చెప్పారు. రాజ్‌కుమార్ మొబైల్ ఫోన్‌లో సెల్ఫీ వీడియోలో పలు కీలక అంశాలు ఉన్నాయని తెలిపారు. బాలికను నమ్ముకుని అన్నివిధాలా మోసపోయానని వీడియోలో అతడు తెలిపారని అన్నారు. ఈ కేసుకు సంబంధించిన విషయాలను సీపీ తరుణ్ జోషీ మీడియాకు వెల్లడించారు. తాను అప్పులపాలయ్యానని ఈ వీడియోలో చెప్పుకొచ్చినట్లు సమాచారం ఉందని అన్నారు. జీవితం మీద విరక్తి చెందినట్లు నిందితుడు వెల్లడించారని తెలిపారు. తన సంపాదనలో సగం వాళ్లకే పెట్టానని.. తన దగ్గర డబ్బు వసూలు చేసి నష్టపరిచారని అతను ఆ వీడియోలో తెలిపాడని అన్నారు. తన పిల్లలకు భూమి లేకుండా చేసుకున్నానని. ఆ అమ్మాయిని నమ్మి అప్పుల పాలయ్యానని తెలిపారు. చివరకు కేసు పెట్టి జైలుకు పంపాలని చూస్తున్నారని వీడియోలో రాజ్‌కుమార్ రికార్డ్ చేశారని సీపీ తరుణ్ జోషీ వెల్లడించారు..
బాలికతో పాటు ఐదుగురిని హంతుకుడు రాజ్‌కుమార్ హత్య చేశాడని సీపీ తరుణ్ జోషీ తెలిపారు. 11 నుంచి 12 గంటల మధ్యలో ఆరు హత్యలు జరిగాయని చెప్పుకొచ్చారు. రాజ్‌కుమార్ కారును అద్దెకు తీసుకున్నాడని తెలిపారు. ఈ ఘటన జరిగిన రోజు పదిన్నర గంటలకు ఊర్లోకి అతను వచ్చాడని అన్నారు. అమ్మాయిని తీసుకుని దేవరకొండకు వచ్చాడని చెప్పారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లు అలవాటు ఉండటంతో నిందితుడు 16 సిమ్ కార్డులు వాడాడని అన్నారు. నిందితుడికి రూ.2 కోట్లకుపైగా అప్పు ఉందని వెల్లడించారు. దానివల్ల మానసిక పరిస్థితి స్థిమితంగా లేదని చెప్పారు. కాలేజీ నుంచి వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు ఆ బాలికను వేధించాడని అన్నారు. అతనిపై పోక్సో కేసు ఉందని.. తాజాగా ముందస్తు బెయిల్ వచ్చిందని వెల్లడించారు. రూ.2 వేలకు కారు అద్దెకు తీసుకుని ఆరుగురి హత్యలకు వినియోగించాడని చెప్పుకొచ్చారు.
షాబాద్‌లో బాలిక నాన్నమ్మను చంపి అక్కడ నుంచి ఆమెను తీసుకుని దైవాలగూడ వెళ్లాడని సీపీ తరుణ్ జోషీ తెలిపారు. అక్కడ బాలిక, తన భార్యను, పిల్లలను నిందితుడు చంపేశాడని వెల్లడించారు. 11:37లకు తన తండ్రికి ఫోన్ చేసి ఆరుగురిని చంపేశానని, తాను ఆత్మహత్య చేసుకుంటానని రాజ్‌కుమార్ చెప్పాడని తెలిపారు. ఒంటిగంటకు హంతకుడి తండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చారని చెప్పారు. ఈ ఘటన తర్వాత బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆ తర్వాత నిందితుడిని పట్టుకునేందుకు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని వెల్లడించారు. జీపీఎస్ ఆధారంగా రాజ్‌కుమార్‌ని పట్టుకునేందుకు యత్నించామని చెప్పారు. క్లూస్ టీం సభ్యులు మృతదేహం లభించిన ప్రాంతాన్ని పరిశీలించారని అన్నారు. ఎన్నిగంటలకు రాజ్‌కుమార్ చనిపోయాడనేది క్లారిటీ లేదని తెలిపారు. క్లూస్ టీమ్ అధికారులు అతని మృతదేహం లభించిన ప్రాంతాన్ని పరిశీలించారని అన్నారు. పెంజర్లలో రాజ్‌కుమార్ మేనమామ ఉన్నారని తెలిపారు. నిందితుడికి సంబంధించిన నలుగు ఫ్యామిలీలు ఈ గ్రామంలోనే ఉంటున్నాయని సీపీ తరుణ్ జోషీ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
దేవాలయాల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు: మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ మెగా ఆపరేషన్..
Read Latest AP News And Telangana News And National News
And Telugu News