Share News

భర్తకు మద్యం తాగించి.. పెట్రోల్‌ పోసి హత్య

ABN , Publish Date - Nov 30 , 2026 | 04:05 AM

వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ భార్య.. ప్రియుడితో కలిసి అతడికి మద్యం తాగించి, కత్తితో పొడిచి దారుణంగా హత్యచేసింది. అనంతరం పెట్రోల్‌ పోసి నిప్పంటించింది.

భర్తకు మద్యం తాగించి.. పెట్రోల్‌ పోసి హత్య

  • వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భార్య దారుణం

  • సంగారెడ్డి జిల్లాలో ఘటన.. నిందితుల అరెస్టు

న్యాల్‌కల్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ భార్య.. ప్రియుడితో కలిసి అతడికి మద్యం తాగించి, కత్తితో పొడిచి దారుణంగా హత్యచేసింది. అనంతరం పెట్రోల్‌ పోసి నిప్పంటించింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం మెటల్‌కుంట గ్రామ శివారులో వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆదివారం హద్నూర్‌ పోలీస్‌స్టేషన్‌లో జహీరాబాద్‌ డీఎస్పీ సైదా నాయక్‌ వెల్లడించారు. వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలం ఘనాపూర్‌కు చెందిన మన్నె రమేశ్‌ (45), భాగ్యమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. అదే గ్రామానికి చెందిన తమ బంధువు మన్నె గోపాల్‌ (44) సుమారు రెండు దశాబ్దాల క్రితం న్యాల్‌కల్‌ మండలంలోని రేజింతల్‌ గ్రామానికి ఇల్లరికంగా వచ్చి స్థిరపడ్డాడు. అతడితో భాగ్యమ్మకు ఆరేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది.


ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. తమ సంబంధానికి రమేశ్‌ అడ్డుగా ఉన్నాడని భావించిన భాగ్యమ్మ, తన ప్రియుడు గోపాల్‌తో కలిసి భర్తను హతమార్చాలని పథకం వేసింది. శనివారం రాత్రి నిందితులు ఇద్దరూ రమేశ్‌ను మెటల్‌కుంట శివారులోకి తీసుకెళ్లి మద్యం తాగించారు. మత్తులోకి దిగిన తర్వాత కత్తితో విచక్షణారహితంగా పొడిచి హతమార్చారు. అనంతరం మృతదేహంపై పెట్రోల్‌ పోసి తగులబెట్టి పరారయ్యారు. గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు గమనించిన మెటల్‌కుంట గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇందిర ఈ నెల 28నహద్నూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌ సహాయంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ, ఘటనా స్థలంలో లభించిన ఇతర సమాచారం ఆధారంగా కొన్ని గంటల్లోనే కేసును ఛేదించారు. నిందితులను రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ సైదా నాయక్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అంతకంతకూ పెరుగుతున్న పసిడి ధర.. వచ్చే వారమూ అదే సీన్!

ఓ చేతిలో తుపాకి.. మరో చేతిలో కర్రతో...

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 30 , 2026 | 04:05 AM